Begin typing your search above and press return to search.
కొన్ని ఉద్యోగాలంతే.. లక్షలిస్తామన్నా పనిచేయరు
By: Tupaki Desk | 21 Feb 2023 5:01 PM GMTకొన్ని ఉద్యోగాలు భిన్నంగా ఉంటాయి. కొన్ని నెలల పాటు ద్వీపంలో ఉండడం.. రోజులో నిర్ణీత గంటలు నిద్రపోవాల్సి ఉండడం.. ఇలా రొటీన్ కు భిన్నంగా సాగుతుంటాయి అవి. ఎంత డబ్బిస్తామన్నా అలాంటి ఉద్యోగాలు చేయడం ఇబ్బందికరమే. అయితే సాహసవంతులు, భిన్నత్వం కోరుకునే కొందరు మాత్రం ఇలాంటి కొలువులు చేయడానికి సై అంటారు. వారి ఉద్దేశంలో ఇదో ఎంజాయ్ మెంట్. పనికి పని, డబ్బుకు డబ్బు అన్నది వారి ఆలోచన.
లక్షలకు లక్షలు..
స్కాండినేవియన్ దేశాలు.. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ కాస్త భిన్నమైనవి. నేచర్ కు ప్రాధాన్యం ఇచ్చే దేశాలివి. అంతేకాదు అక్కడ నిబంధనలు చాలా కఠినంగానూ ఉంటాయి. అన్నిటికి మించి చాలా విషయాల్లో ఉదారంగా వ్యవహరిస్తుంటాయి. కాగా, వీటికి దగ్గరగా ఉంటుంది స్కాట్లాండ్. గ్రేట్ బ్రిటన్ లో భాగంగానూ దీనిని పరిగణిస్తారు. ఈ దేశంలో ఉంది అబెర్డీన్ తీరం. ఇక్కడ ఓ విభిన్న కొలువుంది. అందులో పనిచేసేందుకు రారమ్మని ఆహ్వానాలు పంపుతున్నారు. కానీ, ఎవరూ రావడం లేదంట.
ఉత్తర సముద్రంలో..
స్కాట్లాండ్ లోని ఉత్తర సముద్రం (నార్త్ సీ)లో ఆఫ్‌షోర్ రిగ్గర్ ఉంటుంది. ఇందులో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగం గురించి వెల్లడిస్తూ.. ఒక కన్సల్టెంట్ సంస్థ ప్రకటన వెలువరించింది. అర్హతలను వివరించింది. ఐదు ఖాళీలు ఉన్నాయని చెప్పింది. సంవత్సరంలో ఆరు నెలల పాటు రోజుకు 12 గంటలు విధులు నిర్వర్తించాలి. సదరు ఉద్యోగి అక్కడే రెండు సంవత్సరాలు ఉండాలని నిర్ణయించుకుంటే.. ఉద్యోగం వీడే ముందు కోటి రూపాయల మేర ప్రయోజనాలు అందుతాయి. ఇంత భారీ మొత్తంలో డబ్బు మూటగట్టుకోవచ్చని తెలిసినా..
ఆశించిన స్థాయిలో ఆసక్తి కానరావడం లేదు. దాంతో తగిన ఉద్యోగి దొరక్క.. సంస్థ ఇబ్బంది పడుతోంది. ఇదిలా ఉంటే.. సముద్రం అడుగున భూమి పొరల్లోని చమురును వెలికితీసేందుకు ఉద్దేశించిన భారీ నిర్మాణాలను ఆఫ్‌షోర్ రిగ్స్(offshore rigs) అంటారు. నెలకు రూ.4 లక్షల జీతం.. అయినా ఖాళీగానే కాగా, తమ సంస్థలో చేరితే పెద్దమొత్తంలో జీతం, ప్రయోజనాలు అందుతాయని స్కాట్‌లాండ్(Scotland)కు చెందిన సంస్థ ప్రకటించింది.
అయినా ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి సంస్థ ఇబ్బంది పడుతోంది. నెలకు రూ.4 లక్షల జీతం.. విహారయాత్రల ఖర్చంతా సంస్థే భరిస్తుంది.. ఉద్యోగ భద్రత.. సంస్థను వీడి వెళ్లే ముందు భారీ ప్రయోజనాలు.. ఒక ఉద్యోగాని(Job)కి ఇన్ని లక్షణాలుంటే ఎవరైనా వదులుకుంటారా..? తక్షణమే చేరిపోరు..! కానీ స్కాట్‌లాండ్(Scotland)లోని చమురు సంస్థలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.