ఇక్కడ శృంగారం చేస్తే ఇంటి అద్దె ఫ్రీ

Tue Jul 07 2020 09:30:02 GMT+0530 (IST)

Home rent is free if you do romance

పాశ్చాత్య దేశాల్లో బంధాలకు విలువ లేకుండా పోతోంది. ఇలా పెళ్లి చేసుకోవడం.. అలా విడిపోవడం.. పెళ్లి అనే దానికి విలువ లేదు. ఐదేళ్లు కలిసి ఉంటే మహాగొప్ప. మనలాగా వివాహ వ్యవస్థపై ఏకపత్నీ వత్రంలపై విదేశీయులకు నమ్మకం లేదు. మోజు తీరేంత వరకు ఉంచుకోవడం.. విడిపోవడం కామన్. అందుకే తమకు పార్ట్ నర్ కావాలనే ఆశ నడివయస్కుల్లో పెరిగిపోతోంది. ఇందుకోసం వారు వినూత్నమైన ప్రతిపాదన చేస్తున్నారు.తాజాగా ఇంటి అద్దె బదులుగా సెక్స్ చేస్తే చాలు అని ఆఫర్లు వెలువడుతున్నాయి.. వినడానికే విడ్డూరంగా ఉన్న ఇది నిజం.. ఎక్కడో కాదు.. ఆధునిక దేశం ఇంగ్లండ్ లో .. ఇటీవల కాలంలో అక్కడి పత్రికల్లో ఈ తరహా ప్రకటనలు ఎక్కువయ్యాయట..

ఈ ప్రకటనలో ప్రధానంగా ఇంటి యజమానులు.. అద్దె కావాల్సిన మహిళలు సంప్రదించాలని కోరుతున్నారు.. ఇంటికి అద్దె అవసరం లేదని... కాకపోతే మాతో సెక్స్ కు ఒప్పుకోండి చాలు.. అని ప్రకటనలు ఇచ్చేశారు. ముఖ్యంగా ఈ తరహా ప్రతిపాదనలు ఒంటరి మహిళలకు ఎదురవుతున్నాయట.. ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉందంటూ దీనిపై బీబీసీ సంస్థ ఓ డాక్యూమెంటరీయే తీస్తోందట..

వాస్తవానికి ఇలాంటి ప్రతిపాదనలు పంపండం.. ప్రకటనలు ఇవ్వడం కూడా నేరాల జాబితాలోకే వస్తాయి. కానీ ఈ ప్రతిపాదనల గురించి కంప్లయింట్ ఇచ్చే వారు చాలా తక్కువ. ఆప్రపోజల్ నచ్చితే ఇంట్లోకి అద్దెకు చేరిపోవడం.. లేకపోతే మౌనంగా అక్కడి నుంచి తప్పుకోవడం.. ఇదీ ఇప్పటివరకు జరుగుతోంది. కానీ ఇప్పుడు అక్కడ కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న మహిళలు ఈ అంశంపై దృష్టిసారించారట..