Begin typing your search above and press return to search.

వాయిదాలు క‌ట్ట‌లేక కారు అమ్మేసిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   11 May 2017 4:58 PM GMT
వాయిదాలు క‌ట్ట‌లేక కారు అమ్మేసిన ప‌వ‌న్‌
X
టీటీడీ ఈఓగా ఏకే సింఘాల్ నియామ‌కం విష‌యంలో ఉత్త‌రాది, ద‌క్షిణాది వ్యాఖ్యల‌ వేడి, ఈ విష‌యంలో జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్లు ఆస‌క్తికరంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌లు వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌వ‌న్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఉత్తర భారతాన్ని తాను వ్యతిరేకించట్లేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. హిందీ భాషకు చాలా ప్రాధాన్యతనిస్తానన్నారు. దేశం ఒక్కటిగా కలిసి ఉండాలని కోరుకునే వారు సమస్యలపై గొంతెత్తాలన్నారు. అచితూ దేశ సమగ్రత దెబ్బతినకూడదని అన్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, తాను ప్రజల పక్షమేనన్నారు. ప్రజల తరుపున ఏ సమస్యలున్నా తాను ప్రశ్నిస్తానని ప‌వ‌న్ తెలిపారు.

జనసేన అధినేత పవ‌న్ కల్యాణ్‌తో ఏపీ గ్రూప్‌ -2 అభ్యర్థులు హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2ను వాయిదా వేయడంతో అభ్యర్థులు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణ‌కు చెందిన‌ విద్యార్థులు సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మావేశం అయి కాలేజీల్లో త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేశారు. ఇంజినీరింగ్‌ కాలేజీ సమస్యలను విద్యార్థులు తమ దృష్టికి తెచ్చారని, ప్రైవేట్‌ కాలేజీలు తమను దోచుకుంటున్నాయని విద్యార్థులు వాపోయార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వాలు వాళ్లను అరెస్ట్‌ చేయడం సరికాదని తెలంగాణ ప్ర‌భుత్వం తీరును త‌ప్పుప‌ట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించమంటే రైతులను అరెస్ట్‌ చేయడం సరికాదని పవ‌న్ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసేందుకు ఎవరికైనా హక్కుందన్నారు. న్యాయం జరగనప్పుడు గొంతెత్తే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందన్నారు.

ప్రజా సమస్యలపై గొంతెత్తే వేదిక ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌ అన్నారు. ధర్నా చౌక్‌ కోసం జరుగుతున్న పోరాటానికి జనసేన మద్దతునిస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ధర్నా చౌక్‌ను తొలగించే విషయమై సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం తనను కలిశారన్నారు. శాంతియుతంగా జరిగే ధర్నాలను అడ్డుకోవడం సరికాదన్నారు. ధర్నా చౌక్‌ కోసం జరుగుతున్న పోరాటంలో జనసేన పాల్గొంటుందని తెలిపారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే జనసేన ఉద్దేశమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

కాగా త‌న మ‌ర్సిడేజ్ బెంజ్ కారును అమ్మేసిన విష‌యం నిజ‌మేన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంగీక‌రించారు. కారుకు నెల నెల క‌ట్టాల్సిన వాయిదాల‌ను భ‌రించ‌లేక దాన్ని అమ్మేసిన‌ట్లు ప‌వ‌న్ వెల్ల‌డించారు.