Begin typing your search above and press return to search.

ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ భారీ వ‌ల‌యం!

By:  Tupaki Desk   |   2 Jun 2021 10:00 AM GMT
ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ భారీ వ‌ల‌యం!
X
ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. భ‌గ భ‌గ మండుతున్న సూర్యుడి చుట్టూ.. పెద్ద గోళాకారంలో భారీ వ‌ల‌యం ఏర్ప‌డింది. దీనిని టెక్నిక‌ల్ ప‌రిభాష‌లో హ్యాలోస్‌గా పేర్కొంటున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా ఈ దృశ్యం క‌నిపించ‌డం లేద‌ని ఏపీ, తెలంగాణ స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌నిపించిన సూర్యుడి చుట్టూ గోళాకారం.. వంటి దృశ్యం ప్ర‌తి ఒక్క‌రూ చూడొచ్చ‌ని నిపుణులు పేర్కొన్నారు.

సాధార‌ణంగా ఏర్ప‌డే వ‌ల‌యాల‌కు భిన్నంగా ఏడు రంగుల్లో ఈ వ‌ల‌యాకారం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా ఎలాంటి ఇబ్బంది ఉండ‌బోద‌ని ఇశ్రో శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ప్ర‌తి నెలా ఈ అద్భుతం ఆవిష్కృత మ‌వుతుంద‌ని.. రెయిన్ బో మాదిరిగానే ఇది ఏర్పడుతుంద‌ని.. పేర్కొన్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఏర్ప‌డిన ఈ వ‌ల‌యం ఒకింత పెద్దదిగా ఉంద‌ని.. దీనిని ఎవ‌రైనా వీక్షించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పౌరుల‌తోపాటు.. ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌జ‌లు సైతం వీక్షిస్తున్నారు. ఒక ఉప‌గ్ర‌హం సూర్యుడికి స‌మీపంగా వ‌చ్చిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. సుమారు రెండు గంట‌ల పాటు.. ఈ అద్భుతం ఆకాశంలో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. కాగా, ప్ర‌స్తుతం ఎండ‌లు మండిపోతున్న త‌రుణంలో.. ప్ర‌జ‌లు ఒకింత ఉప‌శ‌మ‌నం కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రుతుప‌వ‌నాల రాక ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.కానీ, ఈ ద‌ఫా రుతుప‌వ‌నాలు మాత్రం ఆల‌స్యం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సూర్యుడి చుట్టూ ఏర్ప‌డిన వ‌ల‌యం ప్ర‌జ‌ల్లో హ‌ర్షాతిరేకాలు నింపింది. రుతుప‌వ‌నాల రాక‌కు ఇది నిద‌ర్శ‌న‌మా? అనే చ‌ర్చ సాగింది. అయితే.. రుతుప‌వ‌నాల రాక‌కు.. ఈ భార వ‌ల‌యానికి సంబంధం లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.