Begin typing your search above and press return to search.

హ‌రేన్ పాండ్యాది క‌ట్ అవుట్ మ‌ర్డ‌ర్?

By:  Tupaki Desk   |   7 Nov 2018 5:39 AM GMT
హ‌రేన్ పాండ్యాది క‌ట్ అవుట్ మ‌ర్డ‌ర్?
X
దాదాపు ప‌దిహేనేళ్ల క్రితం గుజ‌రాత్ రాష్ట్ర హోంమంత్రి హ‌రేన్ పాండ్యా హ‌త్య‌కు గురి కావటం తీవ్ర సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో ప‌లువురిని దోషులుగా నిర్ణ‌యించి కోర్టు శిక్ష‌ల్ని కూడా విధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కేసుకు సంబంధించి మ‌రో సంచ‌ల‌న అంశం తెర మీద‌కు వ‌చ్చింది. హ‌రేన్ పాండ్యాను హ‌త్య చేసింది న‌యిం మూఠా అంటూ కొత్త అంశం తెర మీద‌కు వ‌చ్చింది.

పాండ్యా హ‌త్య కాంట్రాక్టు సొహ్రాబుద్దీన్ స్నేహితుడు వెల్ల‌డిస్తున్న వివ‌రాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. సొహ్రాబుద్దీన్‌.. అత‌డి అనుచ‌రుడు తుల‌సీరామ్ ప్ర‌జాప‌తి ఎన్ కౌంట‌ర్ కేసును ముంబ‌యి సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా సొహ్రాబుద్దీన్ స్నేహితుడు ఆజంఖాన్ వెల్ల‌డించిన అంశాలు విస్మ‌యానికి గురి చేయ‌ట‌మే కాదు.. కొత్త అనుమానాల‌కు తావిచ్చేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

గుజ‌రాత్ హోంమంత్రి హ‌రేన్ పాండ్యాను హ‌త్య చేసేందుకు గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి డీజీ పంజారా సొహ్రాబుద్దీన్‌కు కాంట్రాక్ట్ ఇచ్చార‌ని.. దాన్ని అత‌డు న‌యిం.. అత‌డి అనుచ‌రుడు షాహిద్ క‌లిసి పూర్తి చేసిన‌ట్లుగా త‌న‌కు చెప్పిన‌ట్లుగా ఆజంఖాన్ వెల్ల‌డించారు. మ‌రి.. ఈ విష‌యాన్ని సీబీఐ విచార‌ణ‌లో ఎందుకు చెప్ప‌లేద‌న్న మాట‌కు బ‌దులుగా.. తానీ విష‌యాలు చెప్పిన‌ప్ప‌టికీ.. అన‌వ‌స‌ర‌మైన గంద‌ర‌గోళానికి కార‌ణం అవుతుంద‌ని అధికారులు చెప్పిన‌ట్లుగా చెప్పారు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో హ‌రేన్ పాండ్యా హ‌త్య‌ను క‌ట్ అవుట్ మ‌ర్డ‌ర్ గా అభివ‌ర్ణిస్తున్నారు. ఎందుకిలా ఉంటే.. హ‌త్య‌కు గురైన వ్య‌క్తి.. హ‌త్య‌కు పుర‌మాయించిన వ్య‌క్తికి మ‌ధ్య సంబంధాల్ని రుజువు చేయ‌టం ఈ ఎపిసోడ్‌లో క‌ష్ట‌మ‌వుతుంది. అదెలా అంటే.. ఏ అనే వ్య‌క్తి జెడ్ అనే వ్య‌క్తిని హ‌త్య చేయించాల‌ని డిసైడ్ అవుతాడు. అందుకు బి అనే వ్య‌క్తికి పుర‌మాయిస్తారు. బి కాస్తా ఆ ప‌నిని సీకి అప్ప‌గిస్తారు. ఇలా ఈ చైన్ సాగి వై వ‌ర‌కూ వెళుతుంది. వై కాస్తా జెడ్‌ను చంపుతాడు. కానీ.. జెడ్ ను చంపిన వైకి.. ఏకి మ‌ధ్య‌నున్న సంబంధాల్ని రుజువు చేయ‌టం సాధ్యంకాదు. ఒక‌వేళ‌.. చైన్ మొత్తాన్ని తెర మీద‌కు తెచ్చినా.. ఆ క్ర‌మంలో చైన్ లో ఉన్న ఏ ఒక్క‌రు మ‌ర‌ణించిన గొలుసు మొత్తం తెగిపోతుంది. అప్పుడు కుట్ర డీల్‌ను ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్ట‌టం ఎప్ప‌టికీ సాధ్యం కాదు. ఇలాంటి కేసుల్ని క‌ట్ అవుట్ మ‌ర్డ‌ర్ గా అభివ‌ర్ణిస్తారు. ఇలాంటి కేసులు ఎప్ప‌టికి తేల‌కుండా ఉండిపోతాయి.