Begin typing your search above and press return to search.
తీవ్ర ఒత్తిడిలో సాఫ్ట్ వేర్ జాబర్లు..: భయపెడుతున్న ఆ సంస్థ నివేదిక..
By: Tupaki Desk | 22 Feb 2023 6:00 PM GMTఒకప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ అంటే హాట్ కేక్. మొదట్లో తక్కువ జీతమైనా సరే.. జాయిన్ అయ్యారు. ఆ తరువాత ప్రతిభ కొద్దీ జీతం పెరిగేది. ఊహించని ఆదాయమే కాకుండా సకల సౌకర్యాలతో కూడిన జీవితం. మధ్య మధ్యలో ఇన్సెంటివ్ లు.. ఫారిన్ టూర్లు.. ఇలా ఒక పనిలో ఎంజాయ్ చేసేవాళ్లు ఎవరంటే సాఫ్ట్ వేజ్ ఉద్యోగులే అనేవారు. కొంత మంది అమ్మాయిలు సాఫ్ట్ వేర్ జాబ్ ఉంటే పెళ్లి చేసుకుంటానని పట్టుబడిన వాళ్లూ ఉన్నారు.
అయితే ఇప్పుడు ఓడలు బండ్లు.. బండ్లు ఓడలైన పరిస్థితి. సాఫ్ట్ వేర్ జాబ్ అంటే రోగాల కుప్ప అని భావిస్తున్నారు. ఈ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నట్లు కొన్ని సంస్థలు నివేదికలు బయటపెడుతున్నాయి. తాజాగా సిగ్న ఇంటర్నేషన్ హెల్త్ 12 వేల మంది సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన ఉద్యోగులపై సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో 91 శాతం మంది మానసిక ఒత్తిడితో గురవుతున్నారు. వీరిలో 18 నుంచి 20 శాతం మంది తీవ్ర మనోవేదనతో బాధపడుతున్నారు. అయితే వీరికి ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీరిలో చాలా మంది చదువుకునే సమయంలో సాధారణ స్థితిలో ఉన్నవారు ఈ రంగంలోకి చేరగానే ఒత్తిడికి గురైనవారున్నారు. మరికొందరు కోవిడ్ పరిస్థితుల్లో ఏర్పడిన భయంతో తమ జాబ్ మళ్లీ ఎక్కడ పోతుందోననే భయంతో నెట్టుకొస్తున్నవారున్నారు.
అలాగే ఆర్థిక మాంద్యం, ఇతర పరిస్థితుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక బ్రిటన్ లో 84 శాతం మంది సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వారు కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో 34 శాతం మంది యువతలో ఇన్నర్ మైనస్ ఫీలంగ్ ఉంటుందట. అంటే తాము ఈ జాబ్ కు కరెక్టా లేదా? అనే ఫీలింగ్ తో ఆవేదన చెందుతున్నారట.
సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వారికి స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది రిలాక్స్ కోసం రకరకాల వ్యాపకాలు ఏర్పరుచుకుంటారు. కొందరు మద్యంకు అలవాటు పడుతారు. మరికొందరు పబ్ లు ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు.
ఈ తరుణంలో స్నేహితులతో కలిసి మెలిసి ఉండకపోవడం, వారితో మనస్పూర్తిగా మాట్లాడలేకపోయే సంఘటనలు ఎదురవుతున్నాయట. దీంతో మానసిక ఒత్తిడిని వారిలోనే ఉంచుకొని అనేక వ్యాధులకు గురవుతున్నట్లు సిగ్న అనే సంస్థ తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.