Begin typing your search above and press return to search.

సాఫ్ట్‌వేర్ రంగంలో దిగ‌జారిన ఏపీ.. 15వ స్థానం.. 3లో తెలంగాణ !

By:  Tupaki Desk   |   18 Dec 2022 4:30 PM GMT
సాఫ్ట్‌వేర్ రంగంలో దిగ‌జారిన ఏపీ.. 15వ స్థానం.. 3లో తెలంగాణ !
X
ఐటీ.. ఈ మాట‌కు ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెట్టింది పేరు. చంద్ర‌బాబు హ‌యాంలో ఐటీ ప‌రుగులు  పెట్టింది. సైబ‌రాబాద్ న‌గ‌ర‌మే ఏర్ప‌డింది. బెంగ‌ళూరు త‌ర్వాత‌..ఏపీ అనే మాట ఉండేది. ఇక రాష్ట్ర విభ‌జ న త‌ర్వాత కూడా.. విశాఖ‌ను ఐటీ న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు అనేక కంపెనీల‌ను చంద్ర‌బాబు ఆహ్వానిం చారు. ఇక్క‌డ అనేక పెట్టుబ‌డులు కూడా వ‌చ్చాయి. ముఖ్యంగా.. మైక్రోసాఫ్ట్ అధినేత హైద‌రాబాద్లో పెట్టుబ‌డులు పెడితే.. గూగుల్ వంటి సంస్థ‌లు ఏపీకి వ‌చ్చాయి.

ఇలాంటి మ‌హోన్న‌త చ‌రిత్రలో ఇప్పుడు ఏపీ క‌నిపించ‌కుండా పోయే ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది. ప్ర‌స్తు తం ఏపీ ప‌రిస్థితి ఎలా ఉందంటే.. సాఫ్ట్‌వేర్ మ్యాప్‌లో జీరో స్థాయికి చేరింది. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం దీనిపై ఎలాంటి శ్ర‌ద్ధా చూపించ‌క‌పోవ‌డ‌మేన‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో దిగ్విజ‌యంగా సాగిన సాఫ్ట్‌వేర్ రంగం.. ఇప్పుడు జ‌గ‌న్ ఏలుబ‌డిలో దిగ‌నాసిగా మారిపోయింది.

సాఫ్ట్ వేర్ ఎగుమ‌తుల్లో కానీ.. స్టార్ట‌ప్ కంపెనీల ఏర్పాటులో కానీ.. ఏపీ దేశంలో చాలా వెనుక‌బ‌డిపోయింది. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో అనేక కంపెనీలు.. సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్ టీపీఐ), సెజ్‌లు.. అనేక ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేశాయి. వీటి విలువ సుమారు.. 11,59,210 కోట్లగా ఉంది. వీటిలో క‌ర్ణాట‌క 3,95,904 కోట్లు, మ‌హారాష్ట్ర 2,36,808 కోట్లు, తెలంగాణ 1,80,617 కోట్లు.. ఆదాయంతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ 15వ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్ర ఎగుమ‌తులు..  అత్యంత దారుణంగా 0.111%గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో సాఫ్ట్‌వేర్ ఉత్ప‌త్తులు.. రూ. 1,290 కోట్ల మేర‌కు మాత్ర‌మే ఎగుమ‌తి అయ్యాయి. వీటిలో 926  కోట్ల యూనిట్లు ఎస్‌టీపీఐలోను. రూ. 364  కోట్ల యూనిట్లు సెజ్‌ల‌లోనూ రిజిస్ట‌ర్ అయ్యాయి.