Begin typing your search above and press return to search.
సర్పంచ్ గా పోటీ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..మద్దతు తెలిపిన ఎమ్మెల్యే బాలయ్య!
By: Tupaki Desk | 12 Feb 2021 6:56 AM GMTఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తకరంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే తోలి దశ పోలింగ్ కూడా ముగిసింది. తోలి దశ లో అధికార పక్షమైన వైసీపీ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక రెండో దశకు పోలింగ్ శనివారం జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు ఈసీ సిద్ధం చేసింది. అలాగే మూడో దశ ఈ నెల 17న.. నాలుగో దశ ఈ నెల 21న జరగనున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నయ్యల మీద తమ్ముళ్లు పోటీ చేస్తున్నారు, భార్య మీద భర్తలు పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దఫా ఎన్నికల్లో యువత కూడా ఎక్కువగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుంది. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, స్థానిక యువకులు కూడా బరిలో నిలుస్తున్నారు. సొంత ఊరిని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్రధాన పార్టీల మద్దతుతో కొందరు.. స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు పోటీలో నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే .. అనంతపురం జిల్లా కొండూరు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా యువకుడు, ఐటీ ఉద్యోగి సిద్ధార్థ నామినేషన్ దాఖలు చేశారు. బీటెక్ చదివి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొండూరు సర్పంచి పదవి బీసీ జనరల్ కు రిజర్వు కావడంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి పోటీ చేసేందుకు స్వగ్రామానికి వచ్చారు. యువకుడి ఆసక్తిని తెలుసుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ మద్దతుదారుగా ఎంపిక చేశారు సిద్ధార్థను ప్రొత్సహించారు.