Begin typing your search above and press return to search.
మాపై ఆ ముద్ర... సోషల్ మీడియా ట్రోల్స్... వల్లభనేని ఆవేదన
By: Tupaki Desk | 21 Feb 2023 10:01 AM GMTగుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య సఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా వారిద్దరూ ఓ జట్టుగా ఉండేవారు. ప్రత్యర్థులను తమదైన శైలిలో ఓ ఆట ఆడుకునేవారు.
తాజాగా వివిధ పరిణామాలపై స్పందించిన వల్లభనేని వంశీ టీడీపీలో ఉండగా తాము ఎదుర్కున్న ఓ చిత్రమైన సమస్య గురించి స్పందించారు. టీడీపీలో తమను కావాలనే టార్గెట్ చేశారని, జూనియర్ ఎన్టీఆర్ టీం అంటూ ముద్రవేసి తమను ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు.
గతంలో ప్రధాన స్రవంతి మీడియాలో, ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వంశీ మండిపడ్డారు.
టీడీపీలో ఉన్న సమయంలో తాము జూనియర్ ఎన్టీఆర్ అనుచరులమని పేర్కొంటూ.. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని, వంశీ ఆయన వెంటనే నడుస్తారని టీడీపీ అనుకూల మీడియాలో లోకేష్ ప్రచారం చేయించాడని మండిపడ్డారు.ఈ విషయంలో తాము చంద్రబాబుకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
ఇక తాజాగా లోకేష్ కనుసన్నల్లో నడిచే ఐ టీడీపీ బృందం కొత్త ట్రోలింగ్స్ చేస్తోందని వంశీ మండిపడ్డారు. ఆడ వాళ్ల బొమ్మలతో తన ఫొటో పెట్టి పాటలు పెట్టే మానసిక దౌర్భల్యం నారా లోకేష్‌దే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేష్ చదువులకు డబ్బు ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు చంద్రబాబు పెద్ద సైకో అయితే.. లోకేష్ చిన్న సైకో అని దుయ్యబట్టారు. పకోడి గాళ్లంతా తనకు డిపాజిట్ లేకుండా చూస్తామంటున్నారని సెటైర్ వేశారు. టీడీపీ నేతలు కాకుండా చంద్రబాబు కానీ లోకేష్ కానీ తనపై పోటీ చేయాలని వంశీ సవాల్ విసిరారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.