Begin typing your search above and press return to search.

ఏపీలో సోష‌ల్ మీడియాకు తాళం.. నోరెత్తితే సంకెళ్లే!!?

By:  Tupaki Desk   |   7 April 2023 6:00 AM GMT
ఏపీలో సోష‌ల్ మీడియాకు తాళం.. నోరెత్తితే సంకెళ్లే!!?
X
సోష‌ల్ మీడియా.. సామాన్యులు త‌మ అభిప్రాయాల‌ను నిస్సంకోచంగా వెల్ల‌డించే అద్భుత‌మైన వేదిక‌గా .. ఇటీవ‌ల కాలంలో ఆద‌ర‌ణ పొందుతున్న మాధ్యమం. సుప్రీం కోర్టు నుంచి రాష్ట్రాల కోర్టుల వ‌ర‌కు కూడా సోష‌ల్ మీడియా పై ఆంక్ష‌లు విధించ‌డానికి లేద‌ని.. ఇది భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కింద‌కు వ‌స్తుంద‌ని పేర్కొంటున్నాయి. గ‌తంలో క‌ర్ణాట‌క‌లో విద్యార్థినుల‌ను అరెస్టు చేసిన తీరును ఆక్షేపిస్తూ.. ఐటీ చ‌ట్టంలోని కొన్ని క్లాజుల‌ను కూడా కోర్టులు కొట్టేశాయి.

అయితే వీటితో మాకేం ప‌ని అనుకుంటున్నారో కోర్టులు కూడా తాము చెప్పిన‌ట్టే న‌డుచుకోవాల‌ని భావిస్తున్నారో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం.. సోష‌ల్ మీడియాకు పోలీసులు సంకెళ్లు వేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల "తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నీకే దిక్కు లేదు. నీ బిడ్డకు ఎక్కడిది రా తమ్ముడూ " అంటూ ప్రతిపక్ష కార్యకర్త ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అంతే.. పోస్టు పెట్టిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే పోలీసులు వాలిపోయారు. స‌ద‌రు కార్య‌క‌ర్త‌ను అరెస్టు చేశారు.

మ‌రో ఘ‌ట‌న‌లో.. "నాయకుడు కార్యకర్తకు అండగా ఉండాలి. జీవనోపాధి మీద కొట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా నాయకుడు మేలు చేయకపోగా.. ఉన్న ఉద్యోగంలో నుంచి తీసేయించి ద్రోహం చేశాడు "అని అధికార పార్టీ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతే.. పోలీసులు ఊరుకుంటారా? వెంట‌నే స‌ద‌రు వ్య‌క్తి వైసీపీ అభిమాని అనే విష‌యాన్ని కూడా మ‌రిచి ఐటీ చ‌ట్టం కింద కేసులు పెట్టి బొక్క‌లో ఏసేశారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారే లక్ష్యంగా కొన్నేళ్ల కిందట వరకూ సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసేవారు. అరెస్టు చేసి, విచారణ పేరిట వేధించేవారు. ఇప్పుడు ఈ బాధ్యతలను స్థానిక పోలీసులు తీసుకున్నారని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా రు. కేసులు పెట్టి, అదుపులోకి తీసుకుని విచారణ పేరిట హింసిస్తున్నారని అంటున్నారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబసభ్యుల పై అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారి పై మాత్రం అసలు చర్యలే తీసుకోవట్లేదని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. అస‌లు ఫిర్యాదులే స్వీకరించడం లేదని అంటున్నారు. ఇటీవ‌ల టీడీపీ మ‌హిళా విభాగం నాయ‌కురాలు వంగ‌ల‌పూడి అనిత‌.. నారా లోకేష్‌ తో మాట్లాడుతూ.. మ‌రోసారి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేలా కృషి చేస్తామ‌ని అన్న‌ట్టుగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

అయితే అది త‌న వాయిస్ కాద‌ని మార్ఫింగ్ చేశార‌ని ఆమె పేర్కొంటూ. పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే వారు తీసుకోలేదు. ఇక‌, పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఇటీవ‌ల‌ జ‌న‌సేన‌కు మాతోనే అవ‌స‌రం మాకు జ‌న‌సేన అవ‌స‌రం లేదు అ న్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. దీనిపైనా ఆయ‌న ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కుద‌ర‌ద‌ని పోలీసులు పంపేశారు. ఇదీ సంగ‌తి!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.