Begin typing your search above and press return to search.

వీర్యం రేటు పెర‌గాలంటే ఆ పువ్వు తినాల్సిందే.

By:  Tupaki Desk   |   12 Jun 2020 10:30 PM GMT
వీర్యం రేటు పెర‌గాలంటే ఆ పువ్వు తినాల్సిందే.
X
పూలు అంటే అలంక‌ర‌ణ కోసం.. మ‌హిళ‌లు ధ‌రించ‌డం కోస‌మే కాదు.. ఎన్నో ర‌కాలుగా మాన‌వులుకు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. పువ్వును ప్రేమిస్తే ఆడ‌వారిని ప్రేమించిన‌ట్టే. పువ్వుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. పువ్వుల‌ను మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం ఎంతో ఉప‌యోగిస్తున్నాం. మ‌నం వాడే సెంట్‌లు, స‌బ్బుల్లో కూడా పువ్వులు ఉంటాయి. అయితే కొన్ని పువ్వుల‌ను నేరుగా వాడితే మ‌న శ‌రీరానికి ఎంతో మేలు. ఈ విష‌యం ఎంతోమంది చెప్పారు. పూల‌ను పాల‌ల్లో.. ఆహారంలో భాగంగా చేసుకుంటే మ‌న ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. ముఖ్యంగా రోజా పూలు తీసుకుంటే మ‌గాడి శ‌క్తిని పెంచుతుంది. వీర్యం రేటు పెర‌గ‌డానికి ఈ పూలు ఎంతో దోహ‌దం చేస్తుంటాయి.

రోజా పూలల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అందుకే మ‌హిళ‌లు ఎక్కువ‌గా తీసుకుంటారు. ఈ పువ్వులు చర్మాన్ని తాజాగా, అందంగా మార్చ‌డానికి దోహ‌దం చేస్తుంది. ఈ పూలల్లో ఒత్తిడిని మాయం చేసే గుణాలు ఉన్నాయి. అందుకే ఏదైనా డిప్రెషన్‌గా అనిపించినప్పుడు ఈ పూల వాసన చూస్తే చాలు.. క్షణాల్లో అందంగా మారుతారు. మ‌న‌సు హాయిగా మారుతుంది.

ఈ రోజా పూల రేకులని చాలామంది తింటారు. వీటిని తినడంతో మ‌న శ‌రీరానికి ఎంతో దోహ‌దం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గుతారని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అయితే వీటిని డైరెక్ట్‌గా తినలేం. కొంద‌రు తింటారు కూడా. అయితే డైరెక్ట్‌గా తిన‌లేని వారు ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు సలాడ్స్, పాల‌లో కలిపి తీసుకోవచ్చు. రోజా పూ రేకుల్లో మెటబాలిజం చక్కగా పని చేస్తుంది. వీటిని తినడం వల్ల అన్ని అవయవాల పని తీరు మెరుగవుతుందని చ‌ర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు.

తలనొప్పితో బాధపడేవారు రోజ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ఉంటుంది. రోజూ పూల రేకులను గుప్పెడు తింటే అవి శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. రక్తశుద్ధి కూడా చేస్తాయి. వీటిని తినడంతో వీర్య క‌ణాల వృద్ధి బాగా జరుగుతుంది. ఈ విష‌యాన్ని చాలామంది ఆయుర్వేద నిపుణులు చెప్పారు. శృంగార శ‌క్తిని ఈ పూలు పెంచుతాయి. ఈ పూల‌ను తింటే శృంగార సమస్యలు, సంతాన సమస్యలు దూరమ‌వుతాయి. మగవారు వీటిని త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

రోజా పూలు అలంక‌ర‌ణ‌లో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి. ప్రేమ‌కు ప్ర‌తిరూపం రోజా పూలు అని అంద‌రికీ తెలిసిందే. ప‌డ‌క్క‌గ‌దిలో ఈ పూలు ఉంచితే అందంగా.. మూడ్‌ను పెంచేలా దోహ‌దం చేస్తుంది. అందుకే ఫ‌స్ట్ నైట్ రోజు ఈ పూల‌ను అధికంగా ఉంచ‌డానికి ఓ కార‌ణం. ఈ పూల వాసన కొత్త దంపతుల‌కు ఒత్తిడిని దూరం చేసి ద‌గ్గ‌ర‌కు చేస్తాయి.

రోజా పూలు తింటే విటమిన్ సీ పాడైన కణాలను బాగు చేస్తాయి. వీటిని తినడంతో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మ‌హిళ‌లు రుతు సమస్యలతో బాధపడుతుంటే వీటిని తింటే సమస్య పరిష్కారమ‌వుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఈ విధంగా ఆహారంతో పాటు ఇంటి అలంక‌ర‌ణ‌లోనూ రోజా పూలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ గులాబీ పూల‌తో ఇంటిని అందంగా అలంక‌రించుకోవ‌చ్చు. ఇంట్లోనే మనం రోజ్ వాటర్‌ని తయారు చేసుకోవచ్చు. ఓ గుప్పెడు పూ రేకులని తీసుకుని చక్కగా కడిగి ఓ గిన్నెలో వేసి నీటిని పోసి ఉంచాలి. ఓ రాత్రంతా అలానే ఉంచాలి.. ఇప్పుడు ఆ నీటిని ఓ కంటెయినర్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోండి. ఇవి ఓ వారం వరకూ హ్యాపీగా వాడుకోవచ్చు.

ఈ విధంగా గులాబీ పూలు మాన‌వ శ‌రీరానికి ఎంతో దోహ‌దం చేస్తాయి. మీరు కూడా త‌ప్ప‌కుండా గులాబీ పూలు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.