Begin typing your search above and press return to search.

ఇప్పటికి అమెరికాలోని ఆ ప్రాంతాలన్ని చీకట్లోనే

By:  Tupaki Desk   |   20 Feb 2021 11:30 AM GMT
ఇప్పటికి అమెరికాలోని ఆ ప్రాంతాలన్ని చీకట్లోనే
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో మంచుతుపాను అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్ని భారీగా వణికించింది. ఊహకు అందని రీతిలో విరుచుకుపడిన విపత్తుకు.. ఆయా రాష్ట్రా్లోని ప్రజలు విలవిలాడిపోయారు. తాగేందుకు నీళ్లు లేక.. ఇంట్లో నుంచి బయటకు రాలేక.. రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. వారు పడిన.. పడుతున్న అవస్థలు అన్నిఇన్ని కావు. మంచుతుపాను విలయం ఇప్పటికి కొనసాగుతోంది. పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటివరకు 56 మంది మరణించారు.

చలిని తట్టుకోలేక కొందరు.. విద్యుత్ సరఫరాలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా కొందరు మరణించినట్లుగా చెబుతున్నారు. వాటర్ పైపుల్లోని నీరు గడ్డకట్టిపోవటంతో.. కనీస అవసరాలు తీర్చుకోలేక వారు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావని చెబుతున్నారు. ఇప్పటికి తాగేందుకు.. కనీస అవసరాలు తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవటంతో తెగ ఇబ్బంది పడుతున్నారు. మంచుతుపాను కారణంగా రోజుల తరబడి పలు ప్రాంతాల్లో విద్యుత్ లేని పరిస్థితి.

ఇప్పటికి టెక్సాస్ లోని పలు ప్రాంతాల్లో నేటికి విద్యుత్ పునరుద్దరణ జరగలేదు. లూసియానా.. వర్జీనియా.. ఓరెగన్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు 3.25 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. వారంతా చీకట్లోనే ఉండే పరిస్థితి. అమెరికా లాంటి దేశంలో కరెంటు లేకపోవటాన్ని ఊహించలేరు. అది లేకుండా క్షణం గడవదు.

అలాంటిది రోజుల తరబడి చీకట్లలో మగ్గాల్సి రావటంతో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల్ని ఆదుకోవటానికి వివిధ సంఘాలు రంగంలోకిదిగాయి. పవన్ గ్రిడ్ లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా.. విద్యుత్ పునరుద్ధరణ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందట. ఆసుపత్రుల్లో జనరేటర్ల సాయంతో పని చేస్తున్నారు.భూతల స్వర్గంగా చెప్పే అమెరికా.. తాజా మంచుతుపాను దెబ్బకు అక్కడి ప్రజలంతా విలవిలలాడిపోతున్న దుస్థితి.