Begin typing your search above and press return to search.

మరీ ఇంత ఫైశాచికమా? పాము తలకు కండోమ్ తొడిగి..

By:  Tupaki Desk   |   6 Jan 2021 3:52 AM GMT
మరీ ఇంత ఫైశాచికమా? పాము తలకు కండోమ్ తొడిగి..
X
కాలం మారింది. సున్నితంగా ఉండాల్సిన మనిషి అంతకంతకూ క్రూరంగా.. పైశాచికంగా మారిపోతున్న సందర్భాల్లో కొన్ని తెర మీదకు రావటం.. షాక్ తినటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. ముంబయిలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో.. పాము తలకు వాడేసిన కండోమ్ ను తొడిగేసి వెళ్లిపోయారు. దీంతో.. ఆ పాము నానా అవస్థలు పడుతోంది.

తిండి తినలేక.. నీరు తాగలేక.. ఏం చేయాలో తోచక విలవిలలాడిపోతోంది. దీంతో.. ఆ పాము అవస్థల్ని చూసిన కొందరు.. వెంటనే వెటరర్నీ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి.. దాని దుస్థితి చూసి కదిలిపోయారు. ముంబయి కందివాల్ ప్రాంతంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ పామును చూసిన వారు.. దాని తల నుంచి కండోమ్ తీసి ఉపశమనం కలిగించారు.

అయితే..ఈ పని మామూలు వ్యక్తులు చేయలేరని.. నిపుణుడైన పాములు పట్టే వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే.. సదరు పాము విషపూరితమైన చెక్కర్డ్ కీల్ బ్యాక్ అనే పాముగా చెబుతున్నారు. విషపూరితమైన దీన్ని ఒడుపుగా పట్టుకొని.. దాని తలకు కండోమ్ తొడగటం అందరికి సాధ్యం కాదంటున్నారు. ఏమైనా.. మూగజీవిని ఇంతలా వేధించటం మాత్రం అన్యాయం.. దుర్మార్గం.. పైశాచికమని చెప్పక తప్పదు.