Begin typing your search above and press return to search.
జార్జ్ సోరోస్ కు లెఫ్ట్.. రైట్ ఇచ్చిన బీజేపీ.. కాంగ్రెస్..!
By: Tupaki Desk | 17 Feb 2023 9:00 PM GMTఅదానీ గ్రూప్ వ్యాపారాలపై న్యూయార్క్ కు చెందిన హిండెన్ బర్గ్ ఇటీవల ఓ నివేదికను బహిర్గతం చేసింది దీని తర్వాత అదానీ గ్రూప్ షేర్స్ మొత్తం కుదేలైన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీకి చెందిన వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. అప్పటి వరకు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ అదానీ హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ప్రపంచ కుబేరుల్లో టాప్ 20 కంటే దిగువకు పడిపోయారు.
పార్లమెంట్ లోనూ అదానీ గ్రూప్ సంస్థలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టారు. దీంతో అదానీ గ్రూప్ వ్యవహరం రాజకీయంగానూ పెద్ద దుమారంగా మారింది. ఇక దీనంతటికీ హిండెన్ బర్గ్ నివేదికే కారణమని భావించిన అదానీ గ్రూప్ ఎదురుదాడికి దిగింది. హిండెన్ బర్గ్ భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఈ నివేదిక విడుదల చేసిందని ఆరోపించింది.
కాగా అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యవహారం భారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రేరేపిస్తుందని.. దీనికి మోదీ జవాబు చెప్పాలని జర్మనీ జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. అదానీకి.. మోదీకి దగ్గర సంబంధాలు ఉన్నాయని.. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడిందని వెల్లడించారు. దీంతోనే రాబోయే రోజుల్లో మోదీ బలహీన పడే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పారు.
అంతేకాకుండా అదానీ వ్యవహారంపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ అవకతవకలపై విదేశీ మదుపర్లు అడుగుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మతీ ఇరానీ గట్టి కౌంటర్ ఇచ్చారు. జార్జ్ సోరెస్ కేవలం ప్రధాని మోదీ పైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. బ్యాంక్ ఆప్ ఇంగ్లాండ్ ను దోచుకున్న జార్జ్ సోరోస్ ను ఆ దేశం ఆర్థిక నేరగాడిగా ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు.
ఇలాంటి వ్యక్తులు ఇతర దేశాల్లోని ప్రభుత్వాలను కూలగొట్టి తమకు నచ్చిన వారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారని ఆమె విమర్శలు గుప్పించింది. ఇలాంటి వ్యక్తులు గతంలోనూ మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూడగా వారిని మనమంతా ఓడించామని తెలిపారు. జార్జ్ సోరోస్ కు వ్యతిరేకంగా దేశమంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలాగే జార్జ్ సోరోస్ కు మద్దతిచ్చే రాజకీయ పార్టీలను ఆమె పరోక్షంగా హెచ్చరించారు.
మరోవైపు జార్జ్ సోరెస్ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ సైతం మండిపడింది. అదానీ వ్యహారం భారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా? లేదా అనేది కాంగ్రెస్.. ప్రతిపక్ష పార్టీలు.. తమ ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇందులో జార్జ్ సోరెస్ లాంటి వ్యక్తులు ఎంత మాత్రం సంబంధం లేదని తెలిపారు.
ఇటువంటి వ్యక్తులు తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేవని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ట్విట్టర్లో స్పష్టం చేశారు. ఏది ఏమైనా జార్జ్ సోరోస్ కు అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ ఒకేసారి లెప్ట్.. రైట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.