Begin typing your search above and press return to search.
2037లో స్మార్ట్ హౌస్.. స్మార్ట్ ఆఫీస్ ఇలా ఉంటుందా?
By: Tupaki Desk | 24 April 2022 4:30 PM GMTమనిషి తన మేధోశక్తిని పెంచుకుంటూ సుఖవంతమైన జీవనానికి అలవాటు పడుతున్నాడు. అంతా యంత్రాలంతో చేయిస్తూ తాను మాత్రం బద్ధకస్తుడిలా మారుతున్నాడు గతంలో మనం ఆదిత్య 369 అనే సినిమా చూశాం. అందులో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మనకు ఆశ్చర్యం వేసింది. ప్రస్తుతం అలాంటి వ్యవస్థే రానుందని తెలుస్తోంది. భవిష్యత్ లో మానవుడు ఇంకా ఎక్కువ సుఖాలు అనుభవిస్తూ తన ఒళ్లు తానే మరిచిపోయే స్థాయికి వెళతాడనే నిజం మనకు కళ్ల ముందు కనబడే సూచనలు కనిపిస్తున్నాయి.
2037 సంవవత్సరంలో మనిషి జీవనం ఎలా ఉండబోతోందనే దానిపై ఓ సారి దృష్టి సారిద్దాం. అంతా డ్రోన్ల మయం కానుంది. మనిషి తన శక్తియుక్తులను ధారపోసి నిరంతరం శ్రమిస్తూ తాను మనిషనే విషయం మాత్రం మరిచిపోతున్నాడు. తన ప్రమేయం లేకుండానే అన్ని పనులు చేసుకునే విధంగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇందుకోసం యంత్రాలను వినియోగిస్తున్నాడు. రోబోలను అందుబాటులోకి తెస్తున్నాడు. డ్రోన్లు వినియోగించి పనులు చక్కబెట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ జరిగితే ఇక మనిషి ఆలోచన లేకుండానే పనులు చకచకా సాగిపోతాయని తెలుస్తోంది.
పడకగది బెడ్ సైడ్ డైనింగ్ టేబుల్ గా మారుతుంది. ఇల్లు అమరిక కూడా ఓ నందనవనంగా ఉంటుంది. నిద్రపోతే మనకు ఎంత మేర నిద్రపట్టింది? మనం గాఢనిద్రలో ఉన్నామా? లేక మెలకవతో ఉన్నామా అనే విషయాలు వెంటవెంటనే రిపోర్టులు అందజేస్తాయి. దీంతో మనం తీసుకునే ఆహారం, వ్యాయామాల్లో చేపట్టాల్సిన మార్పులు ఇట్టే తెలిసిపోతాయి. దీంతో మనిషి ఎక్కువ సమయం కష్టపడాల్సిన పనిలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం అన్నింటిపై రసాయన పదార్థాల వినియోగం పెరుగుతున్నందున తాజా కూరగాయలు దొరకని పరిస్థితి. కోళ్లు, చేపలు నాణ్యమైనవి దొరకవు. అంతా లేబరేటరీల్లో సూపర్ బజార్లోనే విక్రయిస్తారు. దీంతో మనకు మంచి ఆహారం మాత్రం దొరకదు. తాజా రకమైన వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. కుళ్లిన పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.
విద్యుత్ వినియోగానికి మాత్రం ఇబ్బంది ఉండదు. నిరంతరం వెలుగులు ఉండాల్సిందే. దీంతో కరెంటు పోయిన సంగతి కూడా మనకు తెలియదు. అంతలా మన వ్యవస్థ మారుతుంది. సోలార్ పవర్ కూడా ఉండటంతో తుపాన్లు వచ్చినా కరెంటు మాత్రం పోకుండా ఉండటం చూస్తుంటాం.
మరోవైపు ఆరోగ్యాలు బాగుండవు. కృత్రిమ అవయవాలు దొరుకుతాయి. కాలేయం, గుండె, క్లోమగ్రంథి అన్ని ల్యాబుల్లో తయారవుతాయి. దీంతో మనుషుల ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక కరెన్సీ విషయానికి వస్తే డబ్బు మనుషుల చేతుల్లో కనిపించదు. కేవలం సంపన్నుల వద్దే ఉంటుంది తప్ప సామాన్యుడి దగ్గర కాదు.
రోబోలు, డ్రోన్ల వ్యవస్థతో కార్లకు సైతం డ్రైవర్ అక్కరలేదు. మనం ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి నిమిషాల్లో తీసుకుపోతుంది. అనంతరం మళ్లీ మనల్ని ఇంటికి చేరుస్తంది. పిల్లలను కూడా పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తుంది. ఇలా డ్రైవర్ అవసరం లేని కారు మాత్రం భలే పసందుగా ఉంటుంది.
ఇక ఇల్లయితే మనకు సౌకర్యవంతంగా ఉంటుంది. నిద్ర లేచేసరికి కాఫీ, స్నానం చేసేలోగా టిఫిన్, ఆఫీసుకు భద్రంగా తీసుకెళ్లే కారు. ఆరోగ్యం బాగా లేకపోతే వెంటనే బాస్ కుమెడికల్ రిపోర్టు ఇవన్నీ చూస్తుంటే విచిత్రంగా ఉన్నాయి కదూ. కానీ భవిష్యత్ లో మనం అనుభవించే సుఖాలు ఇవే కావడం గమనార్హం. మొత్తానికి మన ఊహకే అందంగా కనిపించే వీటి సార్థకత రాబోయే కాలంలో అందుబాటులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.