Begin typing your search above and press return to search.

కలికాలం ఊర్మిళ ... పడుకుంటే 13 రోజుల పాటు నిద్రలోనే ... ఎందుకంటే !

By:  Tupaki Desk   |   2 May 2021 2:30 AM GMT
కలికాలం ఊర్మిళ ...  పడుకుంటే 13 రోజుల పాటు నిద్రలోనే ... ఎందుకంటే !
X
తండ్రి మాటకి విలువ ఇచ్చి రాముడు వనవాసానికి వెళ్లాడు అని అందరికి తెలిసిందే. ఆ రోజు అన్నతో పాటుగా తమ్ముడు లక్ష్మణుడు కూడా అడవులకి వెళ్తాడు. వారు అలా వెళ్ళగానే లక్ష్మణుడి భార్య ఊర్మిళ వారు వచ్చే వరకు పధ్నాలుగేళ్ళు నిద్రలోనే గడిపిందని చెబుతారు. అలాగే, కుంభకర్ణుడు నిద్ర పొతే ఎప్పుడు లేస్తాడో తెలీదు. ఇప్పుడు కూడా కొంతమంది నిద్ర ప్రియులు ఖాళీ దొరికితే చాలు రోజులో ఎక్కువసేపు నిద్రలోనే గడుపుతుంటారు. వాళ్ళు నిద్రపోయారు అంటే, ఎప్పుడు లేస్తారు అనేది చెప్పలేరు. కొంతమంది ఆరోగ్య పరిస్థితుల రీత్యా వాడుతున్న మందుల వలన ఎక్కువ సేపు నిద్రపోతారు.అయితే ,ఈ కలికాలం లో ఓ ఆమ్మాయి ఒకసారి నిద్రపోతే 13 రోజుల పాటు నిద్రలోనే ఉండిపోతుంది.

అయితే , ఆమెకు నిద్రపోవడం సరదా అని అనుకోవద్దు. ఆమె ఒక వింత సమస్యతో బాధపడుతోంది. ఇండోనేషియాలోని దక్షిణ కాలిమంటన్ ప్రాంతంలోని బంజర్ మాసిన్ లో ఏచా అనే 17 ఏళ్ల బాలిక నివసిస్తోంది. ఒకసారి 2017 సంవత్సరంలో వరుసగా 13 రోజులపాటు నిద్రపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. ఒక్కరోజు తిండి లేకపోతేనే నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఏకంగా 13 రోజులపాటు ఎటువంటి తిండి..నీరులేకుండా నిద్రలో ఉండిపోవడం అంటే సాధారణ విషయం కాదు. ఏచా ఇలా ఒకసారి నిద్రపోతే ఎప్పుడు లేస్తుందో తెలీని పరిస్థితి రెండు, మూడుసార్లు జరిగేసరికి ఆమె తండ్రి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరిశేలించి ఆమెకు ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయితే, అతిగా నిద్రపోవడం వలన ఆమె చాలా బలహీనంగా ఉందని తెలిపారు.

సాధారణంగా హైపర్సోమ్నియా అనే అరుదైన న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి ఇటువంటి అతి నిద్ర సమస్య వస్తుందని డాక్టర్లు చెప్పారు. జన్యు సంబంధిత లేదా మానసిక సమస్యలతో ఇలా జరుగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణం కంటే ఎక్కువ సేపు నిద్రపోతుంటారని వారు వివరించారు. ఏచా తండ్రి ముల్యాది మాట్లాడుతూ.. ''ఆమెను నిద్ర నుంచి లేపడానికి చాలాసార్లు ప్రయత్నించేవాడిని. నాకు అలసట వచ్చేది కానీ ఆమె మాత్రం నిద్రలేచేది కాదు. నిద్రలో ఉన్నప్పుడే ఆమెను బాత్రూమ్‌కు తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాం'' అని తెలిపాడు.