Begin typing your search above and press return to search.
వరసగా లాటరీలు తగిలాయి... ఆరోసారి గెలుచుకున్న లాటరీతో జీవితమే మారిపోయింది.
By: Tupaki Desk | 2 Feb 2021 3:55 AM GMTలాటరీ గెలుచుకోవాలని.. ఆ డబ్బుతో కోటిశ్వరులు కావాలని చాలా మంది కలలు కంటారు. మనదేశంలో లాటరీలు నిషేధం కాబట్టి మనకు కలలు కనే స్వేచ్ఛ కూడా లేదు. అయితే చాలా దేశాల్లో లాటరీ కొనుగోలు చేయడం నేరం కాదు. చట్టబద్దం. ఈ లాటరీలో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. లాటరీలో కొనేసి లక్కీ డ్రా రోజు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఎవరో కోటిలో ఒకడికి ఆ అదృష్టం పట్టుకుంటుంది.
అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆరు సార్లు లాటరీ గెలుచుకున్నాడు. దీంతో అతడి లైఫ్ మారిపోయింది. ఐడాహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్ అనే వ్యక్తి ఇప్పటివరకూ ఐదు సార్లు లాటరీలో గెలిచి కొంత మొత్తంలో డబ్బులు గెలుచుకున్నాడు. ఇటీవల మాత్రం మోస్కు మళ్లీ అదృష్టం పట్టింది. మునుపెన్నడూ లేని విధంగా రూ. 182 కోట్లు (మన కరెన్సీలో) గెలుచుకున్నాడు. అయితే ఆ డబ్బుతో బ్రియాన్ మోస్ ఎంజాయ్ చేయడం లేదు. ఈ డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు.
తన రాష్ట్రంలో పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు.ప్రభుత్వ బడులు అభివృద్ధి చేయిస్తున్నాడు. తాను లాటరీలో పాల్గొనేది కేవలం పేదల బాగు కోసమే అని మోస్ చెబుతూ ఉంటాడు. మామూలుగా ఎవరికైనా లాటరీ దొరికితే ఎంజాయ్ చేస్తారు. కానీ మోస్ మాత్రం ఇలా సేవా కార్యక్రమాలకు వెచ్చించడం పట్ల చాలా మంది అతడిని ప్రశంసిస్తున్నారు.