Begin typing your search above and press return to search.

పాక్ కు మ‌రో ఎదురుదెబ్బ‌: ఆర్మీ మేజ‌ర్‌ - ఆరుగురు జ‌వాన్లు హ‌తం

By:  Tupaki Desk   |   9 May 2020 7:50 AM GMT
పాక్ కు మ‌రో ఎదురుదెబ్బ‌: ఆర్మీ మేజ‌ర్‌ - ఆరుగురు జ‌వాన్లు హ‌తం
X
క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లి ప్ర‌పంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనూ పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధి మార‌డం లేదు. ఇటీవ‌ల త‌ర‌చూ భార‌త‌దేశంలో దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఈ క్ర‌మంలో భార‌త్ తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తూ పాక్ దాడుల‌ను విజ‌య‌వంతంగా తిప్పి కొడుతోంది. దీంతో ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా మ‌రోసారి పాకిస్తాన్‌‌‌ కు మరో షాక్ తగిలింది. పాకిస్తాన్‌ కు చెందిన ఓ ఆర్మీ మేజ‌ర్‌ - ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్ - ఇరాన్ సరిహద్దుల్లో సంభ‌వించింది.

పాక్-ఇరాన్‌ కు సరిహద్దు ఉంది. 14 కిలో మీటర్ల సమీపంలో ఐఈడీ పేల‌డంతో వారు మృత్యువాత ప‌డ్డారు. ఈ దాడికి పాల్ప‌డింది బలుచిస్థాన్ వేర్పాటువాదులు. బలుచిస్థాన్ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక దేశం కావాల‌ని పోరాడుతున్న విష‌యం తెలిసిందే. వీరి పోరాటం పాకిస్తాన్‌కు త‌ల‌నొప్పిగా మారింది. అక్క‌డి ఆందోళ‌న‌లు నియంత్రించడంలో భాగంగా సైన్యంతో బందోబ‌స్తు ఏర్పాటుచేస్తున్నారు. అయితే లిబరేషన్ ఆర్మీ పోరాటం సాగిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం పాకిస్థాన్‌ కు చెందిన మిలటరీ వాహనాన్ని ఐఈడీ పెట్టి పేల్చేశారు. ఐఈడీ మందుపాతరలను అమ‌ర్చి మిల‌ట‌రీ వాహ‌నం రాగానే రిమోట్ కంట్రోల్ సహాయంతో పేల్చేశారు. ఈ ఘ‌ట‌న‌తో ఆర్మీ మేజర్‌ నదీం అబ్బాస్, ఆరుగురు జవాన్లు ఎగిరిప‌డి తీవ్ర గాయాల‌తో మృతిచెందారు. ఈ దాడి తామే చేశామంటూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం విశేషం. ఈ విధంగా పాకిస్తాన్‌ లో ఆందోళ‌న‌లు సాగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌తో ఆర్మీపై బ‌లుచిస్తాన్ ప్ర‌జ‌లు పైచేయి సాధించిన‌ట్టు అయ్యింది.