Begin typing your search above and press return to search.
ఆ కార్లకు ‘ఆరు’ ఎయిర్ బ్యాగులు..కొత్త నిబంధన వచ్చేస్తోందట
By: Tupaki Desk | 15 Jan 2022 2:30 PM GMTకొత్త రూల్ ను తీసుకు రానుంది కేంద్ర ప్రభుత్వం. రోడ్డుప్రమాదాల్లోమరణాలు తగ్గించటానికి.. దెబ్బల తీవ్రతను పరిమితం చేయటం కోసం ఇప్పుడు సరికొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తోంది. దీని ప్రకారం 8 సీట్ల వరకు సామర్థ్యం ఉన్న కార్లు అన్నింటికి ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి కానున్నాయి. ఒకవేళ ఆ కారు 800 సీసీ అయినప్పటికీ ఆరు ఎయిర్ బ్యాగులు పక్కా కానున్నాయి. ఈ తరహా నిబంధనను తీసుకురావాలన్న సూచన నేపథ్యంలో.. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
ఆయన చేసిన వరుస ట్వీట్ల సారాంశం చూస్తే..
''ప్రమాదాల సమయంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆరు ఎయిర్‌బ్యాగుల నిర్ణయం తీసుకున్నాం. జీఎ్‌సఆర్ నివేదికను ఆమోదిస్తూ సంతకం చేశాను. 2019 జూలై నుంచి డ్రైవర్ సీటుకు ఎయిర్ బ్యాగును తప్పనిసరి చేశాం. ఈ ఏడాది జనవరి నుంచి ముందు సీట్లో కూర్చొనే ప్రయాణికుడికి కూడా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చాం. ఎం1 కేటగిరీ వాహనాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది'' అని పేర్కొన్నారు. స్పష్టం చేశారు. 8సీట్ల సామర్థ్యం ఉన్న కార్లు అన్ని ఈ కేటగిరి కిందకు రానున్నాయి. దీనికి తగ్గట్లుగా ఉత్పత్తిదారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికోరారు.
ఇప్పటివరకు ఎయిర్ బ్యాగులు సాధారణ కార్ల మోడళ్లలో..డ్రైవర్ సీటుకు స్టీరింగ్ పైభాగంలో.. ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్ డ్యాష్ బోర్డుకు అనుసంధానంగా ఎయిర్ బ్యాగులు ఉంటాయి. కేంద్రం తీసుకొచ్చే సరికొత్త విధానంలో వెనుక వరుస కానీ.. వారు కూర్చునే సీట్లకు కార్నర్ నుంచి.. ముందు నుంచినాలుగు ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్యాసింజర్ల పక్కన ట్యూబ్ తరహాలో ఎయిర్ బ్యాగ్ ను అమర్చాల్సి ఉంటుంది.
ఈ నిబంధనను దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల ప్రమాదాల్లో ప్రాణాపాయాన్ని తప్పించేందుకేనని చెబుతున్నారు. ఇటీవల కార్ల ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగుల కారణంగా ముందు సీట్లో కూర్చున్న వారు బతికిపోతే.. వెనుక సీట్లో కూర్చున్న వారికి ఎయిర్ బ్యాగుల సౌకర్యం లేని కారణంగా మరణిస్తున్నారు. అలాంటి వారు గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా 17538గా చెబుతున్నారు. ఈ కారణంగా అన్ని వైపులా ఎయిర్ బ్యాగులు ఉంటే.. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో కార్ల ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. కనిష్ఠంగా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. వినియోగదారుడికి చేరే సమయానికి రూ.50 వేల వరకు భారం పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంతకీ ఈ కొత్త నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నసందేహానికి వస్తున్న సమాధానం ఏమిటంటే.. ఈ కొత్త విధానానికి అవసరమైన బిల్లును పార్లమెంటులో పెట్టి.. ఆమోదింపచేసి.. రాష్ట్రపతి సంతకం తర్వాత.. అమల్లోకి వస్తుంది.
దీనికి తోడు.. ఇలా అనుకున్నంతనే అలా అన్నికార్లు సాంకేతికంగాఅప్డేట్ అయ్యే అవకాశం తక్కువే. అందుకే.. కాస్త గడువు ఇచ్చి.. ఈ నిబంధనను అమల్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ నిబంధన వచ్చాక.. చాలామంది తమ కార్లను ఎయిర్ బ్యాగుల విషయంలో అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.