Begin typing your search above and press return to search.

ఒక్కమగాడు .. 500 మందిని పుట్టించాడా !

By:  Tupaki Desk   |   22 Feb 2021 9:36 AM GMT
ఒక్కమగాడు .. 500 మందిని పుట్టించాడా !
X
సాధరణంగా ప్రతి ఒక్కరికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు. మరికొందరైతే ఒక్కరితోనే సరిపెట్టుకుంటారు. ఇది సాధారణ విషయమే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 500 మందికి తండ్రి అయ్యాడు. అదేమైనా యుద్దమా .. ఓ వ్యక్తి 500 మందికి తండ్రి ఎలా అయ్యాడు ? ఇది నిజంగా నిజమేనా అని మీకు డౌట్ రావచ్చు . కానీ ఇది నిజమే ఓ వ్యక్తి 500 మందికి జన్మనిచ్చి ఒక్కమాగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమంటే .. కుటుంబాన్ని పోషించడానికి, సంతానం కోసం పరితపించే జంటల ఆశలను నిజం చేయడానికి ఆ వ్యక్తి వీర్యదానం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 500 సార్లు తన వీర్యాన్ని దానం చేశాడు. పదేళ్ల వ్యవధిలో సుమారు 500 సార్లు తన వీర్యాన్ని దానం చేశాడు. అతడి వీర్యం వల్ల వందలాది మందికి సంతానం కలిగింది.

అయితే , అది మంచి విషయమే కదా , పిల్లలు లేని వారికి తన వీర్యం దానం ఇచ్చి వారి కుటుంబాభివృద్దికి తోడ్పడుతున్నాడు అంటే అది మంచి విషయమే అయినప్పటికీ అదే ఇప్పుడు అయన అసలు కొడుకుకి ఇబ్బందిగా మారింది. అమెరికాలోని ఒరెగాన్‌ కు చెందిన 24 ఏళ్ల జావే ఫార్స్ వీర్యదానం చేసిన అసలు సంతానం. అతడి తండ్రి వీర్యం వల్ల వందలాది మందికి సంతానం కలిగింది. దీనివల్ల జావే‌కు తమ నగరంలో ఎవరితోనూ డేటింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. డేటింగ్ యాప్‌ లు చూడాలంటేనే అతడు హడలిపోతున్నాడు. పొరపాటున తాను తోబుట్టువులు తో శృంగారంలో పాల్గొంటానేమో అనే భయం అతడిని వెంటాడుతోంది. కొన్నిరోజుల క్రితం మెక్‌లెనన్‌ కోలన్‌ తన సోదరుడవుతాడని తెలుసుకున్న జెప్‌, అతడు తన పాఠశాలలోనే చదివాడని తెలుసుకొని షాక్ ‌కు గురయ్యాడు.

ఈ కారణం వల్ల జావే డేటింగ్ యాప్‌ లను చూడటమే మానేశాడు. ఎవరైనా తనకు పరిచయమైతే డీఎన్ ఏ టెస్టు చేయించిన తర్వాతే.. ముందుకెళ్తున్నాడు. తన వీధిలోనే తన తండ్రి డీఎన్ ఏ తో మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇప్పటివరకు తనకు తెలిసి ఎనిమిది మంది పిల్లలు తన తండ్రి వీర్యంతో పుట్టినవారనని తెలిసిందని జావే ఈ సందర్భంగా తెలిపాడు. Ancestry.com అనే వెబ్‌ సైట్‌ ద్వారా.. తన తండ్రి వల్ల ఇంకా ఎంతమంది పిల్లలు పుట్టారనే విషయాన్ని తెలుసుకున్నాడు. మా నాన్న వీర్యదానం వల్ల నాలో ఒక భయం ఉండిపోయింది. టిండర్ వంటి డేటింగ్ యాప్స్ చూసేప్పుడు.. వారిలో తన సోదరి కూడా ఉంటుందేమో అనే ఆందోళన కలుగుతోంది. అందుకే, ఒక వేళ నేను ఎవరినైనా ఎంపిక చేసుకుంటే.. వారికి తప్పకుండా డీఎన్ఏ టెస్టు చేస్తాను. ఆ తర్వాతే ఇంకేదైనా అని తెలిపాడు.