Begin typing your search above and press return to search.

బోనీ కపూర్ కారులో వెండి వస్తువుల కలకలం.. సీజ్

By:  Tupaki Desk   |   8 April 2023 5:01 PM GMT
బోనీ కపూర్ కారులో వెండి వస్తువుల కలకలం.. సీజ్
X
కర్ణాటక ఎన్నికల వేళ అగ్రనిర్మాత బోనీ కపూర్ కారులో లక్షల విలువైన వెండి వస్తువులు దొరకడం కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలోని దావణగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన రూ. 39 లక్షల విలువైన 66 కిలోల వెండి వస్తువులను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్వాధీనం చేసుకుంది.

చెన్నై నుంచి ముంబైకి బీఎండబ్ల్యూ కారులో ఐదు బాక్సుల్లో సరైన పత్రాలు లేకుండా వెండి సామాగ్రిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈసీ అధికారులు వెండి గిన్నెలు, చెంచాలు, నీటి మగ్గులు, ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

దర్యాప్తులో కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ చేయబడినట్లు కనుగొనబడింది.

విచారణలో, వెండి వస్తువులు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవని హరి సింగ్ అంగీకరించాడు.

సంబంధిత పత్రాలు సమర్పించని వెండి వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెండి వస్తువులు నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవా కాదా అని కూడా వారు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు, విలువైన వస్తువులు పంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈసీ స్టిక్ట్ గా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే బోనీ కపూర్ కారులో ఈ విలువైన వస్తువులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది. పత్రాలు లేని వాటిని సీజ్ చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.