Begin typing your search above and press return to search.

అంచలంచెలుగా ఎదిగిన సిద్ధ రామయ్య

By:  Tupaki Desk   |   20 May 2023 3:42 PM GMT
అంచలంచెలుగా ఎదిగిన సిద్ధ రామయ్య
X
ఆయన నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి ఈ రోజున రెండు సార్లు కర్నాటక సీఎం పదవిని అలంకరించారు. ఆయనే సిద్ధ రామయ్య. ప్రజల మనిషిగా పేరు పొందారు. బడుగు బలహీన వర్గాల కు పెద్ద దిక్కుగా నిలిచారు. సిద్ధ రామయ్య శనివారం కర్నాటక ముఖ్యమంత్రి గా కాంగ్రెస్ తరఫున రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన రాజకీయ జీవితం తీసుకుంటే చాలా మందికి స్పూర్తివంతంగా ఉంటుంది. అవినీతి మచ్చ లేని జీవితం. పేద ప్రజలతో విడదీయరాని బంధం, అట్టడుగు వర్గాల కు ఆరాధ్య దైవంగా సిద్ధ రామయ్య నిలిచారు. అందువల్లనే ప్రజలంతా ఆయనే సీఎం కావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం మంది ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు.

సిద్ధ రామయ్య తన రాజకీయ జీవితాన్ని భారతీయ లోక్ దళ్ పార్టీ ద్వారా ప్రారంభించారు. ఆయన 1983లో తొలిసారి చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తరువాత జనతా పార్టీలో చేరారు. గెలిచిన రెండేళ్లకే అంటే 1985లో ఏర్పడిన రామక్రిష్ణా హెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా స్థానం సంపాదించారు. ఆ తరువాత 1989లో జనతాదళ్ పార్టీలో చేరారు.

ఆయన తరువాత కాలంలో జనతాదళ్ చీలిపోవడంతో దేవేగౌడ నాయకత్వంలోని జనతాదళ్ ఎస్ లో చేరారు ఆ విధంగా ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన కీలక బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. తన జీవితంలో ఆర్ధిక మంత్రిగా 13 బడ్జెట్ల ను ప్రవేశపెట్టిన ఘనత సిద్ధ రామయ్యదే కావడం విశేషం.

ఇక జేడీ ఎస్ కి ఒక దశలో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. మరో వైపు 2004లో కాంగ్రెస్ జేడీఎస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే డిప్యూటీ సీఎం గా కూడా సిద్ధరామయ్య పనిచేశారు. 2006లో దేవెగౌడ తన కొడుకు కుమారస్వామి రాజకీయ జీవితం కోసం సిద్ధ రామయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశరు. ఆ విధంగా ఆయన 2006లో కాంగ్రెస్ లో చేరారు అనతికాలంలోనే కాంగ్రెస్ సిద్ధాంతాలను ఔపాసన పట్టిన సిద్ధ రామయ్య ఆ పార్టీకి తలలో నాలుకగా మారిపోయారు.

ఆయన 2013లో కాంగ్రెస్ 122 సీట్లతో అధికారంలోకి తీసుకుని వచ్చారు. 2018 వరకూ అయిదేళ్ల పాటు పాలించిన సీఎం గా ఆయన నిలిచి పోతారు ఇపుడు మరో సీనియర్ నేత డీకే శివకుమార్ తో కలసి కాంగ్రెస్ ని 137 సీట్లతో అధికారంలోకి తీసుకుని వచ్చిన సిద్ధ రామయ్య కాంగ్రెస్ పెద్దల మన్ననలు అందుకుని మళ్లీ సీఎం పీఠం ఎక్కారు. ఆయన పట్ల జనాల కు ఒక నమ్మకం ఉంది. అందుకే ఆయనకే కాంగ్రెస్ సీఎం గా చాన్స్ ఇచ్చింది.

ఆర్హ్దిక మంత్రిగా ఆయనకు కీలక బాధ్యతలు తెలుసు. కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీల ను ఆయన నెరవేరుస్తారు అన్న నమ్మకంతో పార్టీ ఆయనను సీఎం చేసింది. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే కర్నాటకలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న కురుబకు చెందిన సిద్ధ రామయ్య తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అయినా తమ బిడ్డను చదివించాలని వారు తపన పడ్డారు. అలా న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న సిద్ధ రామయ్య మైసూరులో కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశారు.

ఆయన 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ఎన్నికై అలా రాజకీయాల్లోకి ప్రవేసించారు. ఈ రోజున కర్నాటక సీఎం గా అంచెలంచెలుగా ఎదిగిన సిద్ధ రామయ్య కంగ్రెస్ కి అతి పెద్ద బలంగా చెప్పుకోవాలి. అందుకే ఏరి కోరి మరీ ఆయన్ని రాహుల్ గాంధీ సీఎం ని చేశారు.