Begin typing your search above and press return to search.
బాలికపై ఎస్ఐ అత్యాచారం.. సహకరించిన తల్లి.. రూ.లక్షకు బేరం..!
By: Tupaki Desk | 26 Jun 2021 7:30 AM GMTప్రజల మానప్రాణాలను రక్షిస్తానని ప్రమాణం చేసినవాడే.. దౌర్జన్యం చేశాడు. దారుణానికి ఒడిగట్టాడు. ఓ మైనర్ బాలికపై తుపాకీ ఎక్కుపెట్టి మరీ అత్యాచారం చేశాడు. దీనికి బాధితురాలి తల్లి కూడా సహకరించడం సంచలనం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మరో విషయం ఏమంటే.. ఆ బాలిక తల్లితోనూ నిందితుడికి వివాహేతర సంబంధం ఉండడం గమనార్హం. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో ఎస్ ఐగా పనిచేస్తున్న వ్యక్తి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. చెన్నైలోని మాధవరంలో డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్లిన సదరు సబ్ ఇన్ స్పెక్టర్.. చేయాల్సిన డ్యూటీ వదిలేసి మరో డ్యూటీకి మరిగాడు! అక్కడ ఓ మహిళతో పరిచయం పెంచుకొని, వివాహేతర సంబంధం మొదలు పెట్టాడు.
కిరాణా షాపు నిర్వహించే ఆమెకు దుకాణం తెరుచుకునేందుకు ఫుల్లుగా పర్మిషన్ ఇచ్చేవాడట. తనకు సహకరిస్తున్న వాడికి ఏదో ఒకటి సమర్పించాలని భావించి, తననే సమర్పించుకుంది. అలా మొదలైన వ్యవహారం.. ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంట్లో మనిషిగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి వచ్చేవాడట సదరు పోలీసు అధికారి.
అయితే.. ఆమెకు 15 ఏళ్ల కూతురు ఉంది. ఆ మైనర్ బాలికపై కన్నేశాడు ఈ పోలీసు. ఈ విషయం వాళ్ల అమ్మతో చెప్పడం.. ఆమెకూడా అందుకు అంగీకరించడం గమనార్హం. కానీ.. ఆ పాప అంగీకరించలేదు. దీంతో.. తన పోలీస్ రివాల్వర్ తో బెదిరించి మరీ అత్యాచారానికి ఒడిగట్టాడట. ఈ విషయం బయటకు చెబితే.. ఇంట్లో వారందరినీ చంపేస్తానని అన్నాడట.
ఈ విషయం దాచి పెట్టడానికి బాధితురాలి తల్లికి లక్ష రూపాయలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. బాధితురాలు మాత్రం తనుకు జరిగిన అన్యాయాన్ని వాట్సాప్ ద్వారా మహిళా పోలీస్ స్టేషన్ కు తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. ఈ బాగోతం మొత్తం బయటపడింది. సీన్ కట్ చేస్తే.. సదరు ఎస్ఐ తోపాటు బాధితురాలి తల్లిని కూడా కటకటాల వెనక్కు తోసేశారు.