Begin typing your search above and press return to search.
ఇలా ఆడితే 'శుభ'మే.. రాహుల్ స్థానం 'గిల్లు'డే
By: Tupaki Desk | 11 March 2023 4:11 PM GMTఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా దీటుగా బదులిస్తోంది. యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ సెంచరీ కొట్టేశాడు. ఇప్పటికే వన్డేల్లో డబుల్, టి20ల్లో సెంచరీ కొట్టిన గిల్.. టెస్టుల్లోనూ ట్రిపుల్ సెంచరీ చేస్తాడంటూ దిగ్గజాలు, మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు అతడి టెక్నిక్, నిలకడ, దూకుడును ఉదాహరణగా చూపుతున్నారు. కాగా, ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టలకు గిల్ కు అవకాశం దక్కలేదు. మూడో టెస్టులో బరిలో దిగిన అతడు కుదురుకున్న సమయంలో వికెట్ పారేసుకున్నాడు. దీనికి సర్దిచెప్పేలా నాలుగో టెస్టులో ఆడాడు.
10 ఇన్నింగ్స్ లో 5 సెంచరీలు డబుల్ సెంచరీ సహా గత పది ఇన్నింగ్స్ లో ఐదు సెంచరీలు.. ఇదీ శుబ్ మన్ ప్రస్తుత ఫామ్. దీన్నిబట్టే అతడి నిలకడ చెప్పొచ్చు. ఈ ఐదు సెంచరీల్లో ఒకటి డబుల్ సెంచరీ. మరొకటి టి20 సెంచరీ. మరో విశేషం ఏమంటే.. ఓ మూడు సెంచరీలను నాలుగు వన్డే మ్యాచ్ ల వ్యవధిలో కొట్టాడు. టి20లకు సరితూగుతాడా? అని అనుకుంటున్న దశలో అందులోనూ సెంచరీ కొట్టి తిరుగులేదని చాటాడు. ప్రస్తుతం నాలుగో టెస్టులోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గిల్ (128) పెవిలియన్ చేరాడు. లయన్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. టెస్టుల్లో గిల్ కు ఇది రెండో సెంచరీ. 194 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొన్నాడు. ఓవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, పుజారా పెవిలియన్ చేరినా.. గిల్ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో
స్వదేశంలో గిల్ కు ఇదే తొలి సెంచరీ. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడాడు.
రాహుల్ కు ఎసరే..
గిల్ ఫామ్ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానాన్ని ప్రమాదంలో పడేసింది. ఇప్పటికే వన్డేలు, టి20ల్లో రాహుల్ కు గిల్ ఖో చెప్పాడు. టెస్టుల్లోనూ ఇదే పని చేసేలా ఉన్నాడు. ఆసీస్ తో సిరీస్ లో రెండు టెస్టుల్లో ఫెయిలైన రాహుల్ స్థానంలోనే గిల్ ఆడుతుండడం గమనార్హం. దీన్నిబట్ి చూస్తే రాహుల్ మిగతా రెండు ఫార్మాట్లలోనూ అప్రమత్తం ఉండాలి. ప్రస్తుతం వన్డేల్లో కీపింగ్ చేస్తున్న రాహుల్ టి20ల్లో యువ కీపర్ ఇషాన్ కిషన్ నుంచి ప్రమాదం ఎదుర్కొంటున్నాడు. అటు కిషన్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఘనత అందుకున్న బ్యాటర్ కావడం గమనార్హం. మరోవైపు టెస్టుల్లో గిల్ అలవోకగా 8 వేల నుంచి 10 వేల పరుగులు చేయగలడలని దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ అంటున్నాడు. మిచెల్ స్టార్క్ వంటి పేసర్ బౌలింగ్ లో గిల్ చాలా తేలికగా ఆడుతున్నాడని కొనియాడాడు.
"గిల్ ఇంకా కుర్రాడే. అతడికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ముందుకొచ్చి మరీ డిఫెన్స్ ఆడే తీరు బాగుంది. స్టార్క్ బౌలింగ్‌లోనూ ఇబ్బంది పడటం లేదు. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్న విధానం ముచ్చటేస్తోంది. బ్యాక్‌ఫుట్ మీదనే కాకుండా ముందుకొచ్చి ఆడిన విధానం కూడా నచ్చింది. టెస్టు క్రికెట్‌కు ఇది చాలా అవసరం. ఇలాగే కొనసాగితే మాత్రం శుభ్‌మన్ గిల్ అలవోకగా 8 వేల నుంచి 10 వేల పరుగులు కూడా సాధించేందుకు వీలుంది. బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను అద్భుతంగా అంచనా వేస్తూ ముందుకు సాగడం గొప్ప విషయం" అని గావస్కర్ చెప్పాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.