Begin typing your search above and press return to search.

పోర్న్ చూస్తున్నారా? అయితే షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:30 PM GMT
పోర్న్ చూస్తున్నారా? అయితే షాకింగ్ న్యూస్
X
చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అందరూ తప్పనిసరిగా చేస్తున్న పని అప్పుడప్పుడూ బూతు బొమ్మలు, వీడియోలు చూడడం.. ఇదొక సహజ ప్రక్రియగా మారిపోయింది. ఆడవాళ్లు సైతం ఈ అశ్లీల వీడియోలను చూస్తున్నారని సర్వేలు ఘోషిస్తున్నాయి. అశ్లీల చిత్రాలు ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఇంటర్నెట్ అందరికీ చేరువ కావడంతో సెల్ ఫోన్ల వల్ల వీటి వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తోంది.

పోర్న్ చూశాక మృగాళ్లు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మరిచి చిన్న పిల్లలని కూడా చూడకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 16మందిపై హైదరాబాద్ సీపీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

సీఐడీ విభాగానికి 16మందికి సంబంధించిన లింక్స్ ను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సెండ్ చేసింది. దీంతో చైల్డ్ పోర్నో గ్రఫీ చూసిన 16మంది ఐపీ అడ్రస్ లను సేకరించి సీసీఎస్ లో సీఐడీ ఫిర్యాదు చేసింది.సీబీఐ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వ్యక్తుల పాలిట అమెరికన్ ఏజెన్సీ సింహస్వప్నంలా మారింది. ఇండియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే విదేజీ ఏజెన్సీ ఇట్టే పసిగడుతుంది. ఐపీ అడ్రస్ ఆధారంగా వివరాలు సేకరించి భారత ఎన్సీఆర్బీకి పంపుతోంది. ఆ వివరాలను సంబంధిత రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకు భారత ఎన్సీఆర్బీ అందజేస్తోంది.

ఈ వివరాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. టిప్ లైన్ అనే ఈ సిస్టమ్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు 16మంది వివరాలు అందాయి. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టేందుకు బాలలపై లైంగిక దాడుల నివారణ, దర్యాప్తు విభాగం కోసం ఢిల్లీలో ప్రత్యేక వ్యవస్థను టీంను 'ఓసీఎస్ఏఈ' పేరిట స్థాపించారు. సీబీఐ స్పెషల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పరిధిలో ఇది పనిచేయనుంది. సో చిన్నపిల్లలతో కూడిన అశ్లీల నీలిచిత్రాలను అప్ లోచేసినా.. చూసినా కూడా మీరు జైలుకు వెళ్లడం ఖాయం. బీ అలెర్ట్ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.