వరల్డ్ నెంబర్ వన్ కు షాకిచ్చిన పాతికేళ్ల మెద్వెదెవ్

Mon Sep 13 2021 14:03:47 GMT+0530 (IST)

shocked by world number one

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది యూఎస్ ఓపెన్ టోర్నీ. మహిళా సింగిల్స్ లో టీనేజ్ సంచలనం ఎమ్మా రుదుకా టైటిల్ ను సొంతం చేసుకున్న వేళ.. పురుషుల సింగిల్స్ లోనూ అదే తరహా సంచలనం ఏమైనా చోటు చేసుకుంటుందా? అన్న అనుమానం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే.. తాజాగా ముగిసిన ఫైనల్ పోరులో వరల్డ్ నెంబరు వన్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ కు షాకిచ్చాడు పాతికేళ్ల మెద్వెదెవ్. ఫైనల్ పోరు ప్రారంభమైన తర్వాత నుంచి ఏ సందర్భంలోనూ వరల్డ్ నెంబరు వన్ కు అవకాశం ఇవ్వని మెద్వెదెవ్.. తన ఆట తీరుతో చెమటలు పట్టించాడు.న్యూయార్క్ లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో.. అభిమానులకు జకోవిచ్ కే మద్దతు తెలిపారు. అయినప్పటికీ.. ఈ సెర్బియన్ స్టార్ ను షాకిచ్చేలా మెద్వెదెవ్ చెలరేగిపోయి ఆడారు. ఒక దశలో హోరాహోరీ పోరు తప్పలేదు. ఆట ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన మెద్వెదెవ్6-4 6-4 6-4 తేడాతో వరుస సెట్లలో టైటిల్ ను ఎగరేసుకెళ్లటం ద్వారా సంచలనంగా మారారు. మొదటి రెండు సెట్లను 6-4 తేడాతో సొంతం చేసుకున్న మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్ ను మొదట్లో జకోవిచ్ మొదట్లో తేలిపోయినా తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికి మెద్వెదెవ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. పాతికేళ్ల సెర్బియన్ ఆటగాడికి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావటం గమనార్హం.

2019లో యూఎస్ ఓపెన్ ఫైనల్ కు చేరి ఓటమిపాలైన తర్వాత మెద్వెదెవ్ పై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అయితే తన ఆటలో ఎలాంటి తప్పులు చేయకుండా.. పాయింట్ మీద పాయింట్ సాధిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అంతేకాదు.. ఒత్తిడిలోకి నెట్టటం ద్వారా తప్పులు చేసేలా చేసి.. టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు సాధించిన ఆటగాడిగా చరిత్రను క్రియేట్ చేద్దామనుకున్న జకోవిచ్ కు నిరాశ తప్పలేదు. ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించటం ద్వారా రోజర్ ఫెదరర్.. నాదల్ సరసన చేసిన అతను.. యూఎస్ టోర్నీని సొంతం చేసుకోవటం ద్వారా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తాడన్న అభిమానుల ఆశకు నిరాశ తప్పలేదు. తన రికార్డు కలను తీర్చుకోవటానికి మరికొంత కాలం వెయిట్ చేయక తప్పనిసరి పరిస్థితి.