Begin typing your search above and press return to search.

వైరల్: ఈమె పెళ్లికూతురా.. కండల వీరవనితా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:30 PM GMT
వైరల్: ఈమె పెళ్లికూతురా.. కండల వీరవనితా?
X
కరోనా కాలంలో ఇప్పుడు అన్నింటికి కంటే ప్రధానమైంది ఆరోగ్యం అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ టైంలో ఫిట్ గా ఉండాలని చూస్తున్నారు. వ్యాయామం చేస్తున్నారు. అయితే అందరూ చేయడం ఒక ఎత్తు.. పెళ్లికి రెడీ అయిన వధువు చేయడం మరో ఎత్తు. వధువు తన పెళ్లి రోజున చేసిన ఈ పని ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా సోషల్ మీడియా ద్వారా ఇట్టే అది మొత్తం ప్రపంచానికి పాకిపోతోంది. క్షణాల్లో తెలిసిపోతోంది. ప్రతీది సంచలనంగా మారుతోంది.

తాజాగా వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నెటిజన్లు తెగ షేర్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వచ్చే వధువు, వరుడి సరదా సరదా వీడియోలు చూసి నెటిజన్లు తనివితీరా నవ్వుకుంటున్నారు.

తాజాగా పెళ్లి రోజున ఫుల్లుగా లెహంగా ధరించి రెడీ అయిన పెళ్లి కూతురు చేసిన పని వైరల్ అయ్యింది. ఆమె మగాడిలా పుషప్స్ చేసిన తీరు చూసి అందరూ అవాక్కయ్యారు. వరుడిలా పెళ్లికి ముందు ఇలా వధువు చేసిన పనిపై సోషల్ మీడియాలో బోలెడు జోకులు పేలుతున్నాయి.

వధువు పెళ్లికూతురులా రెడీ అయ్యి టిప్ టాప్ గా లెహంగా ధరించి పుషప్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వధువు పుషప్స్ చేయడం చూసి చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వ్యాయామాలు పెళ్లికి ముందు అవసరమా? అంటూ కామెంట్ చేస్తున్నారు.