శివసేన ప్రతీకారం షురూ.. రెబల్ ఎమ్మెల్యేలకు చుక్కలు

Sat Jun 25 2022 19:44:49 GMT+0530 (IST)

shiv sena check to Rebel MLAs

శివసేన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఇప్పుడు రెబల్ శివసేన ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంలో క్యాంప్ ఏర్పాటు చేశారు. సీఎం ఉద్దవ్ ఠాక్రేను గద్దెదించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. శివసేన ఎమ్మెల్యేల్లో మూడొంతుల మంది ఏక్ నాథ్ షిండే గ్రూపులో ఉన్నారు.ఈ క్రమంలోనే ముంబైలోని శివసైనికులు భగ్గుమంటున్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద శివసేన పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందంటూ దాడులకు దిగుతున్నారు.

శివసేన రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయాన్ని తాజాగా శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు మర్యాదగా ముంబై వచ్చి సీఎం ఉద్దవ్ కు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ప్రతి ఎమ్మెల్యేకు ఇదే గతి పడుతుందని శివసేన నాయకుడు సంజయ్ మోరే హెచ్చరించారు. ఏక్ నాథ్ షిండే సొంత నియోజకవర్గంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.

ప్రస్తుతం అస్సాంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 38మంది తిరుగుబాటు చేసి ఏక్ నాథ్ షిండే తో కలిసి హోటల్ లో బస చేశారు. ఇందులోని తానాజీ అనే శివసేన ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముంబైలో శివసైనికులు ధ్వంసం చేశారు. పూణేలో కత్రాజ్ ఉపనగర్ లోని బాలాజీ ప్రాంతంలోని రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయంపై శనివారం శివసేన కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

రెబల్ ఎమ్మెల్యే తానాజీకి చెందిన కత్రాజ్ ఉపనగర్ లోని బాలాజీ ప్రాంతంలోని రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయంపై శనివారం శివసేన కార్యకర్తలు దాడులు చేసిన తర్వాత ఫూణే సిటీ శివసేన అధ్యక్షుడు సంజయ్ మోరే మాట్లాడారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని సంజయ్ హెచ్చరించారు. సైలెంట్ గా ఉన్న శివసైనికులు బయటకు వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు మర్యాదగా ముంబై వచ్చి సీఎం ఉద్దవ్ కు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ప్రతీ ఎమ్మెల్యేకు ఇదే గతి పడుతుందని శివసేన నాయకుడు హెచ్చరించారు.

ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శివసేన కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగడంతో రెబల్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. తీవ్ర ఒత్తిడిలో వారంతా ఉన్నట్టు సమాచారం.