గడ్డం గీసుకోవాలని మోడీకి రూ.100 పంపాడు

Thu Jun 10 2021 06:00:02 GMT+0530 (IST)

sent Rs 100 to Modi to shave his beard

కరోనా లాక్ డౌన్ వేళ ప్రధాని నరేంద్రమోడీ సైతం కటింగ్ గడ్డం చేయించుకోకుండా రుషిలా భారీగా పెంచేశాడు. కరోనా వేళ బార్బర్ ను దగ్గరకు రానీయకుండా మహమ్మారి భయంతో వారే కటింగ్ గడ్డాలు చేసుకున్నారు. ఇక మోడీ మాత్రం అలాంటివి చేసుకోకుండా తన లుక్ మొత్తాన్ని మార్చేశాడు.అయితే మహారాష్ట్ర బారామతికి చెందిన అనిల్ మోరే అనే ఓ టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని మోడీకి రూ.100 పంపి.. గడ్డం గీసుకోవాలని సూచించాడు.

‘దేశ ప్రధానిని అవమానించడం బాధపెట్టడం నా ఉద్దేశం కాదని.. కరోనాతో పేదలు పడుతున్న ఇబ్బందులు ఆయనకు తెలియజేయాలనుకున్నా.. లాక్ డౌన్ ల వల్ల కలిగిన నష్టాల నుంచి ప్రజలను బయటపడేయాలి. అందరికీ వేగంగా టీకాలు వేయించాలి. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఇలా చేశా’ అని ప్రధాని మోడీకి లేఖ రాశాడు.

అయితే ఏ ఉద్దేశంలో రూ.100 పంపినా కూడా ఇదో నిరసన కార్యక్రమంలా ఆ చాయ్ వాలా వాడుకున్నాడని తెలుస్తోంది. మోడీ కూడా ఒకప్పుడు చాయ్ వాలా కావడంతో దీన్ని ఎలా స్వీకరిస్తాడో చూడాలి మరీ..