Begin typing your search above and press return to search.
‘బాబ్రీ’ తీర్పును సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్..
By: Tupaki Desk | 9 Jan 2021 5:15 AM GMTబాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలో బీజేపీ నేతలు ఎల్కే ఆద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమాభారతితో సహా మొత్తం 32 మందికి ఏ సంబంధం లేదని.. వాళ్లు కూల్చివేతకు ప్రేరేపించారనడానికి ఏ ఆధారాలు లేవని సీబీఐ హై కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాలు చూస్తూ అయోధ్యకు చెందిన కొందరు ప్రస్తుతం అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున హాజీ మహబూబ్, హాజీ సయ్యద్ అఖ్లాక్ అహ్మద్ లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 28 సంవత్సరాల క్రితం బాబ్రీ మసీద్‌ను కర సేవకులు (ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు) కూల్చివేశారు. తదనంతరం దేశవ్యాప్తంగా అనేక అల్లర్లు సాగాయి. అయితే ఈ ఘటనపై ఎన్నో ప్రభుత్వాలు స్పందించాయి. శ్రీకృష్ణకమిటీ ఓ నివేదికను సమర్పించింది. అయితే ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి సహా కొందరు బీజేపీ సీనియర్ నేతలు బాబ్రీ మసీద్ కూల్చివేతను ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేసింది. అయితే ఈ కూల్చివేతకు బీజేపీ అగ్రనేతలు సహకరించారు అనడానికి బలమైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే బాబ్రి మసీద్ నిర్మాణంపై భిన్న వాదనలు ఉన్నాయి.
హిందువులు రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్యలో ఈ కట్టడం ఉండం వివాదానికి కారణమైంది. ఇక్కడ హిందూ దేవాలయం ఉండేదని.. ముస్లిం రాజు బాబర్ దాన్ని కూల్చివేసి అక్కడ మసీద్ నిర్మాణం చేపట్టాడని ప్రజలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో లక్షలమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయోధ్యకు చేరుకొని అక్కడి మసీద్‌ను నేలమట్టం చేశారు.
దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ విషయంపై సీబీఐ ప్రత్యేక కోర్టు 2,300 పేజీల తీర్పు వెలువరించింది. అయితే అయోధ్యలో బాబ్రీ మసీద్‌ను కూల్చివేసేందుకు కుట్ర జరిగినట్టు ఆధారాలు లేవని నిందితులను వదిలేశారు. కోర్టు తీర్పును హిందువులు స్వాగతించగా, ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు కోర్టును ఆశ్రయించారు.