Begin typing your search above and press return to search.

ఐటీ ప‌డిపోతే..ఫార్మా ఆదుకుంటోంది

By:  Tupaki Desk   |   3 Aug 2017 6:04 PM GMT
ఐటీ ప‌డిపోతే..ఫార్మా ఆదుకుంటోంది
X
ఆక‌ర్ష‌ణీయ కెరీర్‌ గా గుర్తింపు పొందిన ఐటీ రంగం క‌ల‌విహీనం అవుతోంది. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ కెరీర్ అయిన ఐటీని వెన‌క్కు నెట్టి ఫార్మా రంగం ముందుకు సాగుతోంది. కొత్త కొలువుల క‌ల్ప‌న‌లో నిరాశ‌జ‌నకంగా ఉండ‌టంతోపాటుగా ఉద్యోగుల నిష్క్రమణ విషయంలో ఐటీ ముందు వరుస‌లో ఉండడం గమనార్హం. 24 శాతం వలసలతో ఐటీ రంగం ముందు వరుసలో ఉన్నట్లు ప్రముఖ ఆన్‌ లైన్‌ రిక్రూట్‌ మెంట్‌ అండ్‌ కెరీర్‌ సొల్యూషన్స్‌ పోర్టల్‌ విస్‌ డంజాబ్స్‌ సర్వే వెల్లడించింది. 22 శాతంతో టెలికాం రంగం రెండవ స్థానంలో ఉంది. 20 - 19.6 - 19.3 శాతం వలసలతో వరుసగా హాస్పిటాలిటీ - టీటైల్‌ - హెల్త్‌ కేర్‌ రంగాలు మూడు - నాలుగు - ఐదవ స్థానంలో ఉన్నాయి. కాగా ఫార్మా రంగంలో మిగతా వాటికంటే కాస్త తక్కువ వలసలు ఉన్నాయి.

విస్‌ డంజాబ్స్‌ డాట్‌ కామ్‌ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2017 మొదటి త్రైమాసికంలో వివిధ రంగాల్లో వేతనాల పెంపు, ఉద్యోగుల నిష్క్రమణపై వేరువేరు రంగాల్లో నిర్వహించిన సర్వేలో ఫార్మా రంగంలో పాజిటివ్‌ సైన్స్‌ కనిపించాయి. 10.8 శాతం వేతనాల పెంపుతో మిగతా అన్ని రంగాల కంటే ముందు వరుసలో ఉన్న ఫార్మాలో ఉద్యోగుల వలసలు కూడా మిగతా రంగాల కంటే తక్కువగా ఉండడం గమనార్హం. వేతనాల పెంపు విషయంలో దేశంలోని పలు ప్రధాన నగరాల కంటే నగరంలో అధికంగా ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా హెల్త్‌ కేర్‌ - హాస్పిటాలిటీ - రీటైల్‌ - ఎఫ్‌ ఎంసీజీ - ఫార్మా - ఐటీ - టెలికాం - మ్యానిఫ్యాక్చరింగ్‌ - ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ తదితర రంగాల్లోని దాదాపు 120 కంపెనీల్లో విస్‌ డంజాబ్స్‌ డాట్‌ కామ్‌ సర్వే నిర్వహిచింది. 2017 మొదటి త్రైమాసికంలో వివిధ రంగాల్లో వేతనాల పెంపు - ఉద్యోగుల నిష్క్రమణపై నిర్వహించిన ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఫార్మా తదితర రంగాల్లో నగరంతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ ఉద్యోగుల వేతనాలు 8 నుంచి 9 శాతం పెరిగాయి. కాగా ఐటీ వంటి రంగాల్లో కొంత అస్థిరత నెలకొన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఒకింత నిరాశాజనకమైన వాతావరణమే అయినప్పటికీ మరో ఆరు నెలల కాలం వరకూ పూర్తి అంచనాకు రాలేమని విస్‌ డంజాబ్స్‌ సీఈఓ అజయ్‌ కొల్లా తెలిపారు. మ‌రోవైపు తొలి త్రైమాసికంలో పలు ప్రధాన నగరాల కంటే హైదరాబాద్‌ లో అధికంగా వేతనాలు పెరిగాయి. ఢిల్లీ - ముంబై - కలకత్తా నగరాలకంటే హైదరాబాద్‌ లో వేతనాల పెరుగుదల అధికంగా ఉండడం గమనార్హం. అత్యధికంగా బెంగుళూరులో 9.7 శాతం - చెన్నై - పూనే నగరాల్లో 9.1 శాతం వేతనాలు పెరగగా, 8.9 శాతంతో హైదరాబాద్‌ మూడవ స్థానంలో నిలిచింది. 8.7 శాతంతో ముంబై - 8.5 శాతంతో కలకత్తా - 7.7 శాతంతో ఢిల్లీ నాలుగు - ఐదు - ఆరు స్థానాల్లో నిలవడం గమనార్హం. కాగా గత సంవత్సరంతో పోల్చితే వేతనాల పెంపు శాతం తగ్గింది. రెండంకలకు మించి వేతనాలు పెరగలేదనే చెప్పాలి.

వేతనాల పెరుగుదలలో మిగతా అన్ని రంగాల కంటే ఫార్మా రంగం ముందుందిద. 10.8 శాతంతో ఫార్మా రంగం మొదటి వరుసలో ఉండగా, 9.9 శాతంతో హాస్పిటాలిటీ రంగం రెండవ స్థానంలో, 9.8 శాతంతో ఐటీ రంగం మూడవ స్థానంలో ఉంది. కాగా టెలికాం రంగంలో 9.6 శాతం, ఇన్ఫాస్ట్రక్చర్‌ లో 9.2 శాతం - మాన్యుఫ్యాక్చర్‌ రంగంలో 9 శాతం వేతనాలు పెరిగాయి.