Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు యూట‌ర్న్ రాజ‌కీయం.. మాన‌క‌పోతే చేటేనా?

By:  Tupaki Desk   |   12 Dec 2020 3:56 AM GMT
చంద్ర‌బాబు  యూట‌ర్న్ రాజ‌కీయం.. మాన‌క‌పోతే చేటేనా?
X
అధికారంలో ఉంటే ఒక‌ర‌కంగా.. అధికారంలో లేక‌పోతే.. మ‌రో ర‌కంగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించ‌డం ప‌రిపా టిగా మారిపోయింది. అయితే.. గ‌తం ఏమో కానీ.. వ‌ర్త‌మానంలో మాత్రం ఇలా నాయ‌కులు వ్య‌వ‌హిస్తే.. అ డ్డంగా దొరికి పోతున్నార‌నేది వాస్తవం. ఎందుకంటే.. సోష‌ల్ మీడియా.. డిజిటల్ మాధ్య‌మాలు ప్ర‌తి ఒక్కరి కీ అందుబాటులోకి వ‌చ్చాయి. దీంతో ఎక్క‌డ ఏం జ‌రిగినా.. గ‌తంలో నాయ‌కులు ఏం చేశారు? ఎలా మాట్లా డారు? అనే రికార్డుల‌ను ప్ర‌జ‌లు వెంట‌నే రిఫ‌ర్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యాలు ఎందుకు చర్చ‌కు వ‌స్తున్నాయంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న‌వారు.. కామెంట్లు చేస్తున్నారు.

అయ్యా.. బాబూ.. మీ హ‌యాంలోనూ ఇంత‌క‌న్నా ఏం వెల‌గ‌బెట్టారు? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వ‌ర‌ద‌లు, తుఫాన్లు వంటి ప్ర‌కృతి వైప‌రీత్యాలు వ‌చ్చిన‌ప్పుడు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌నేది అంద‌రినీ బాధిస్తున్న విష‌య‌మే. అయితే.. వీరికి ప‌రిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వాలు.. అనేక నిబంధ‌న‌లు పెడుతున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన నివ‌ర్ తుఫాను కార‌ణంగా.. రాష్ట్ర రైతాంగం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. అయితే.. వీరికి ప‌రిహారం ఇచ్చే విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం 33 శాతం న‌ష్టం వ‌స్తేనే అంటూ.. కండిష‌న్ పెట్టింది. దీనికి చంద్ర‌బాబు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అన్న‌దాత వ్య‌తిరేక నిర్ణ‌యం అంటూ.. విమ‌ర్శ‌లు చేశారు.

అయితే.. అస‌లు ఈ 33 శాతం న‌ష్టం వ‌స్తేనే అంటూ.. జీవో ఇచ్చిందే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అంటూ.. మంత్రి క‌న్న‌బాబు ఎదురు విమ‌ర్శ‌లు చేశారు. దీనికి చంద్ర‌బాబు నుంచి కానీ, పార్టీ శ్రేణుల నుంచి కానీ స‌మాధానం లేదు. ఇక‌, కేంద్రం అనేక ప‌థ‌కాల‌కు నిధులు ఇస్తున్న‌ప్పుడు.. మీవ‌ని ఎలా చెప్పుకొంటారు? అనేది వైసీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు వేస్తున్న సూటి ప్ర‌శ్న‌. ఇప్పుడు ఈ విష‌యంలోనూ ఆయ‌న అడ్డంగా బుక్క‌య్యారు. ఎలాగంటే.. గ‌తంలో ఫైబ‌ర్ గ్రిడ్‌, గ్రామీణ ర‌హ‌దారులు, ఉపాధి ప‌నులు వేగ‌వంతానికి నిధులు వంటివి ఇచ్చింది .. కేంద్ర ప్ర‌భుత్వ‌మే.కానీ, వీటికి ప్ర‌తిదానికీ.. టీడీపీ స‌ర్కారు లోగో వేసుకుని మ‌రీ ప్ర‌చారం చేసుకున్నారు. మేం వేసిన రోడ్ల‌పై న‌డుస్తూ.. మాకు త‌ప్ప ఓట్లు ఎవ‌రికి వేస్తారు? అంటూ.. ప్ర‌శ్నించారు. అయితే. ఇప్పుడుఅవ‌న్నీ మ‌రిచిపోయి.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల టీడీపీకే న‌ష్ట‌మ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.