Begin typing your search above and press return to search.

కరెంటు బిల్లులు కట్టం.. కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోండి

By:  Tupaki Desk   |   16 May 2023 2:00 PM GMT
కరెంటు బిల్లులు కట్టం.. కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోండి
X
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. విజేతలుఎవరో తేలిపోయింది. అధికారాన్ని ఎవరికి అప్పజెప్పాలన్న తర్జనభర్జనలో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. లేకుంటే.. ఈ పాటికి ప్రమాణ స్వీకారం కూడా పూర్తి అయ్యేది.

ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీని.. ఇప్పుడు అమలు చేయాలని కర్నాటకలోని ప్రజలు కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే.. తాజా ఉదంతం ఒకటి వెలుగు చూసింది.

కర్ణాటక గ్రామీణ ప్రాంతానికి చెందిన కొంతమంది గ్రామస్తులు తాము కరెంటు బిల్లులు కట్టమని చెప్పారు. అంతేకాదు.. తమ బిల్లుల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేయాలని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.

అసలేం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి.. తాము విద్యుత్ బిల్లులుకట్టాలనిభావించటం లేదు.

చిత్రదుర్గ జిల్లాలోని గ్రామస్తులు.. తాముకరెంటు బిల్లు కట్టమని తేల్చేశారు. కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోవాలని బిల్లు కలెక్టర్ గోపికీకి చెప్పటం ఇప్పుడు సంచనలంగా మారింది. అంతేకాదు.. బకాయిలు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే వేయాలని వారు కోరటం గమనార్హం.

ఎన్నికల సందర్భంగా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు కాబట్టి.. వారు తమ బిల్లుల్ని.. బకాయిల్నిచెప్పాలని స్పష్టం చేశారు. ఈ ఉదతం సోషల్ మీడియాలో పోస్టు కావటమే కాదు.. కర్ణాటక వ్యాప్తంగా వైరల్ గా మారింది.