Begin typing your search above and press return to search.
బొత్స గురువు సైకిలెక్కేస్తారట...
By: Tupaki Desk | 19 March 2016 10:19 AM GMT విజయనగరం రాజకీయాలతో మొదలుపెట్టి సమైక్యాంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా - మంత్రిగా - తెలుగు రాష్ర్టాల్లో కీలక కాపునేతగా ఎదిగిన బొత్స సత్యనారాయణను గురువును మించిన శిష్యుడు అంటారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి - ఉత్తరాంధ్రలో వైసీపీలో చేరిన తొలినేతల్లో ఒకరైన సీనియర్ లీడర్ పెన్మత్స సాంబశివరాజు బొత్సకు రాజకీయగురువు. ఇప్పటికీ బొత్స అత్యధికంగా గౌరవించేవారు ఎవరైనా ఉంటే అది పెన్మత్సే. అయితే.... పెన్మత్స శిష్యుడిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బొత్స రాష్ట్రంలో పెద్ద నేతల్లో ఒకరిగా మారారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన తరువాత కూడా ఆయన ఆ పార్టీలోనూ ఎవరికీ సాధ్యం కానట్లుగా ఎక్కువ కాలంపాటు జగన్ కు కుడిభుజంగా వ్యవహరించగలుగుతున్నారు. అలాంటి బొత్సకు గురువైన పెన్మత్స సాంబశివరాజు ఇప్పుడు వైసీపీని వీడుతారని వార్తలొస్తున్నాయి. ఆయన టీడీపీలో చేరుతారని ఉత్తరాంధ్రలో ప్రచారం జరుగుతోంది.
విజయనగరంలోని అశోక్ బంగ్లాలో పెన్మత్స కేంద్ర మంత్రి అశోక్ తో రెండు గంటల పాటు చర్చలు జరిపారట. దీంతో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. పెన్మత్స మాత్రం అదేమీ లేదని ఖండిస్తున్నారు. తమ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని చెబుతున్నారు. పెన్మత్స ప్రస్తుతం వైసీపీలో కేంద్ర పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. అయితే... బొత్సకు ఒకప్పుడు ఆయన రాజకీయ గురువైనప్పటికీ అనంతరం కాలంలో ఇద్దరి మధ్య సయోధ్య తగ్గింది. దీంతో ఆయన బొత్స చేరికను వ్యతిరేకించారన్న వాదనా ఉంది. మరోవైపు అశోక్ గజపతిరాజుతోనూ పెన్మత్సకు వైరం ఉంది. అయినప్పటికీ అశోక్ ను పెన్మత్స కలవడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారింది.