Begin typing your search above and press return to search.

నేను వ‌చ్చాను.. మీరూ రండి తేల్చుకుందాం.. టీడీపీకి పెద్దిరెడ్డి స‌వాల్‌!

By:  Tupaki Desk   |   12 March 2023 7:25 PM GMT
నేను వ‌చ్చాను.. మీరూ రండి తేల్చుకుందాం.. టీడీపీకి పెద్దిరెడ్డి స‌వాల్‌!
X
వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌స్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. టీడీపీ నేత‌ల‌కు రివ‌ర్స్ స‌వాల్ రువ్వారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పుంగ‌నూరు.. త‌నుపుట్టిన జిల్లా చిత్తూరులో అభివృద్ధి లేద‌ని ఇటీవ‌ల టీడీపీ నేత‌లు(నారా లోకేష్‌-అమ‌ర్నాథ్‌రెడ్డి) విమ‌ర్శించార‌ని.. అభివృద్ధిపై చ‌ర్చ‌ల‌కు ర‌మ్మ‌న్నార‌ని.. నేను వ‌చ్చాన‌ని.. కానీ, వారే లేకుండా పోయార‌ని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించా రు. ఇప్ప‌టికైనా తాను సిద్ధ‌మేన‌ని టీడీపీ నేత‌లు ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డ‌కు వ‌స్తాన‌ని.. చ‌ర్చ‌కు తాను రెడీనేన‌ని మంత్రి రివ‌ర్స్ స‌వాల్ విసిరా రు.

చిత్తూరు జిల్లా అభివృద్ధిపై మంత్రి చర్చకు రావాలని ఇరువురు నేతల మద్య సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు చర్చకు రాకుండానే టీడీపీ నేతలు పలాయనం చిత్తగించి.. ఇక్కడి నుంచి వెళ్లిపోయారాని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.

యువగళం పాదయాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లా అభివృద్ధిపై టీడీపీ నేతలు మంత్రి పెద్దిరెడ్డికి స‌వాల్ చేశారు. జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాల‌ని అన్నారు. అయితే.. తాజాగా ఆయ‌న స్పందించారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం తంబళ్లపల్లెలో ఉన్నారని.. అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని మంత్రి తెలిపారు.

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి లోకేష్‌కు తప్పుడు సమాచారం అందించి మాట్లాడిస్తున్నారని అన్నారు. స్వయంగా సవాల్ చేసిన అమర్నాథ్ రెడ్డి కనిపించటం లేదన్నారు. "ఒక వైపు అమర్నాథ్ రెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకుడు, మాజీ మంత్రి అయి ఉండి కూడా.. చిటీలు అందించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. లోకేష్‌తో చెప్పించిందే కాకుండా, అమర్నాథ్ రెడ్డి స్వయంగా మేము సిద్ధంగా ఉన్నామని స్టెట్మెంట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు పలాయనం చిత్తగించారు'' అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

త‌రిమేసింది మీరు కాదా?!

అయితే..పెద్దిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ బూచి చూపించి నారా లోకేష్‌ను.. ఇత‌ర నేత‌ల‌ను జిల్లా నుంచి త‌రిమేశార‌ని.. ఇప్పుడు వ‌చ్చి తీరిగ్గా స‌వాళ్ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టిస్తున్నా ర‌ని మండిప‌డుతున్నారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకుని.. జిల్లాలోనే ఉంటాన‌ని నారా లోకేష్ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ..అ ధికారులు ఆయ‌నను ఉండేందుకు వీల్లేద‌ని తేల్చిచెప్ప‌డంతో లోకేష్ వెళ్లిపోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.