Begin typing your search above and press return to search.
కొత్త కామ్రెడ్ పవన్... ?
By: Tupaki Desk | 3 Oct 2021 1:30 PM GMTఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే అస్తవ్యస్థంగా అని చెప్పాల్సి ఉంటుంది. అధికార పార్టీ వైసీపీ తన పని తాను చేసుకునిపోతోంది. విపక్షంలో అయితే గందరగోళం పీక్స్ లో ఉంది. ఏపీలో తామే వైసీపీకి అసలైన ఆల్టర్నేషన్ అని టీడీపీ ఒక వైపు ఢంకా భజాయిస్తూంటే మధ్యలో సడెన్ గా జనసేనాని దూసుకువచ్చారు. ఆయన 2024 ఎన్నికల్లో తామే అధికారంలోకి వచ్చేది అంటూ గట్టిగానే జబ్బలు చరుస్తున్నారు. మరి ఈ రోజుకు ఒక్క సీటు మాత్రమే ఉన్న జనసేనకు 2024లో మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు ఎలా వస్తాయన్నది ఆలోచించాల్సిందే. అయితే కాబోయే సీఎం తానే అని పవన్ ఇపుడే అనలేదు, 2019 ఎన్నికల వేళ కూడా ఇలాగే గట్టిగా మాట్లాడారు. అయితే నాడు ఘోర ఓటమి జనసేనను వరించింది. మరి దాని గుణ పాఠాలూ, పాఠాలు ఏమైనా ఆ పార్టీ నేర్చుకుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే పవన్ మాత్రం కొన్ని కొత్త పాఠాలను మాత్రం బాగానే వంట బట్టించుకున్నారు అని కూడా చెప్పక తప్పదేమో.
అవేంటి అంటే ఏపీలో రెండు ప్రధాన కులాలకే రాజ్యాధికారమా అని పవన్ తరచూ అంటూ వస్తున్నారు. ఆ రెండు కులాలు ఎవరో అందరికీ తెలిసిందే. టీడీపీ ఆవిర్భవానికి ముందు కాంగ్రెస్ ఏలుబడిలో ఉమ్మడి ఏపీ మూడున్నర దశాబ్దాల పాటు అన్నీ చూసింది. నాడు కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా ఏపీ వరకూ చూస్తే రెడ్ల డామినేషన్ ఉండేది. దాంతో కడుపు మండిన కమ్మలు ఎన్టీయార్ తో చెప్పించి తమకంటూ ఒక పార్టీని పెట్టించుకున్నారని అంటారు. టీడీపీ పొలిటికల్ మూవీ సూపర్ హిట్ కావడంతో కమ్మలు రాజకీయంగా మంచి స్పేస్ సాధించారు. అయితే ఏపీలో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి రాజ్యాధికారం దక్కాలని ఎంతో మంది నేతలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ అది సాధ్యపడడంలేదు.
ఇపుడు పవన్ అదే పనిలో బిజీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కాపులను ఒక్కటి కమ్మంటున్నారు. వారిని పెద్దన్న పాత్ర పోషించమంటున్నారు. అదే సమయంలో మిగిలిన కులాలను కూడా కలుపుకుని పోవాలన్న తాపత్రయం ఆయనలో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన కమ్మలతో తమకు విరోధం లేదని చెప్పుకున్నారు. అందుకే తాను 2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు. ఇక రాయలసీమలో అనంతపురం వెళ్ళిన పవన్ అక్కడ రెడ్లు తనకు గురువులు అంటూ కొత్త పాట పాడారు. రెడ్లు కూడా వైసీపీ బాధితులే అని తేల్చేశారు. వారిని కూడా తాము సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. అంటే పవన్ పక్కా స్ట్రాటజీతోనే ఈ రకంగమైన స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోవాలి.
ఒక వైపు కాపులను ముందు వరసలో పెట్టి కమ్మలను, రెడ్లను దువ్వుతున్న పవన్ అచ్చంగా కామ్రెడ్ అనిపించుకున్నారు. ఇది బాగానే ఉంది కానీ ఇంతదాకా రాజ్యాధికారాన్ని అనుభవించిన కమ్మలు కానీ రెడ్లు కానీ తగ్గుతారా అన్నదే ఇక్కడ పాయింట్. వారు తాము ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ చేయకుండా సైడ్ క్యారక్టర్లకు పరిమితం అవుతారా అన్నది కూడా అతి పెద్ద డౌట్. నిజమే పవన్ కొందరు తగ్గాలి, కొందరు పెరగాలి అంటున్నారు. ఆయన ఉద్దేశ్యంలో ఇప్పటిదాకా కాపులకు అధికారం దక్కలేదు కాబట్టి మిగిలిన వారు తగ్గి వారిని అందలం మీద ఉంచాలని కోరుకుంటున్నారు. కానీ ఒకసారి అధికారం రుచి చూసిన వారు ఇపుడు వెనక్కి తగ్గుతారా. అలా తగ్గితే అది ఒకసారితో ఆగిపోతుందా.
ఇక రాజకీయంగా వెనక్కి నెట్టబడితే మళ్లీ కాలూ చేయి ఊనుకోవడం కష్టమవుతుంది కదా. బీహారు, యూపీలలో బ్రాహ్మణులు రాజ్ పుట్స్ అలా ఒకనాడు వెనక్కి తగ్గి ఈ రోజు సీఎం కుర్చీ దరిదాపుల్లో కూడా లేకుండా పోయిన చిత్రం కూడా చూస్తున్నారు కదా. పైగా పవన్ ముందే చెప్పినట్లుగా రెండు కులాల మధ్య జరుగుతున్న పోరులో వారి మధ్య సఖ్యత తీసుకువచ్చి కాపులను ఉన్నతాసనం మీద కూర్చోబెట్టడం అంటే అత్యంత రిస్క్ తో కూడిన వ్యవహారమే. కానీ పవన్ మాత్రం తాను కమ్మలకు, రెడ్లకు కూడా ఆప్తుడనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.