Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ @ 34... ఏం పాలిటిక్స్ బ్రో!

By:  Tupaki Desk   |   9 July 2023 1:00 PM GMT
ప‌వ‌న్ @ 34... ఏం పాలిటిక్స్ బ్రో!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం అనూహ్యంగా మారుతోంది. ఆయ‌న ఏమ‌నుకున్నారో..ఏమో.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలపై ఫోక‌స్ చేస్తున్నాన‌ని.. ఇక్క‌డ నుంచి త‌న ప్ర‌స్తానం ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు. అంతేకాదు.. ఇక్క‌డ వైసీపీని ఒక్క సీటుకూడా గెల‌వ‌కుండా.. తాము చూస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ప‌వ‌న్ ఏమ‌నుకున్నారో.. కానీ.. ఈ వాద‌న మాత్రం యాంటీ యాంగిల్‌లో ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌చారం జ‌రుగుతోంది.

జ‌న‌సేన పార్టీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌పై వైసీపీ నాయ‌కులు, మంత్రులు చాలా వ్యూహాత్మ‌కంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. కేవ‌లం 34 సీట్లే.. అనే చ‌ర్చ లేవ‌నెత్తుతున్నారు. సీమ జిల్లాల్లోని వైసీపీ కార్య‌క‌ర్త‌లు మ‌రింత ఉత్సాహం చూపిస్తూ.. ప‌వ‌న్ @ 34 అనే ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఇత‌ర కామెంట్లేవీ చేయ‌కుండానే భారీ ఎత్తున ఫ్లెక్సీలుఏర్పాటు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి మాత్ర‌మే ప‌వ‌న్ ప‌రిమిత‌మ‌ని.. రాష్ట్ర వ్యాప్తంగాపై ఆయ‌న‌కే ఆశ‌లు లేవ‌నే చందంగా వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం దంచి కొడుతున్నారు. అయితే.. దీనిని ఖండించేందుకు.. రాష్ట్ర వ్యాప్తంగా తాము పోటీ చేస్తామ‌ని చెప్పేందుకు జ‌న‌సేన నాయ‌కులు ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. అంతేకాదు.. వైసీపీ నాయ‌కులు చేస్తున్న యాంటీ ప్ర‌చారంపైనా వారు రియాక్ట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరోవైపు.. ప్ర‌జ‌ల్లోను... సామాన్యుల్లోనూ ఇదే చ‌ర్చ బ‌లంగా జ‌రిగితే.. అంతిమంగా జ‌న‌సేన‌కు న‌ష్టం వాటిల్ల‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. మ‌రి ప‌వ‌న్ ఉద్దేశం ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం జ‌రుగుతున్న ప్ర‌చారం జ‌న‌సేన‌కు గండికొట్టేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్పటికైనా.. తాము ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తారో.. ఎంత మందికి టికెట్లు ఇస్తారో క్లారిటీ ఇవ్వ‌క‌పోతే.. ఈ ప్ర‌చారం బ‌లోపేతం అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.