Begin typing your search above and press return to search.
పొత్తుల మీద పవన్ మార్క్ సంచలనం...టీడీపీకి షాకేనా...?
By: Tupaki Desk | 9 July 2023 11:40 AM GMTఏపీలో పొత్తుల కధ గడప దాటడంలేదు. పొత్తులు పెట్టుకుని జగన్ సర్కార్ ని గద్దె దించాలని టీడీపీ బలంగా ఆశిస్తోంది. అయితే పొత్తుల కధ రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది. దానికి కారణం మిత్రులు గడుసుతనమే అంటున్నారు. ఏపీలో వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీ కూడా టీడీపీని లైట్ తీసుకుంటోంది. ఇక గత ఎన్నికల్లో ఆరేడు శాతం ఓట్లు సంపాదించుకుని ఈసారి ఆ ఓటు షేర్ ని రెట్టింపు చేసుకునే తలంపులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంత తేలికగా పొత్తు గూటికి చేరుతారా అన్నదే అతి పెద్ద డౌట్.
దానికి తన వైపు నుంచి చెప్పాల్సింది పవన్ చెప్పేస్తున్నారు. లేటెస్త్ గా రెండవ విడత వారాహి యాత్ర సన్నాహాల నేపధ్యంతో పార్టీ నాయకులతో పవన్ మాట్లాడుతూ, పొత్తులకు ఎందుకు తొందర అనేశారు. పొత్తులు అన్నవి చాలా పెద్ద సబ్జెక్ట్. దానికి సరైన సమయం ఉంది, సందర్భం ఉంది. అపుడు మాట్లాడుకుందామని చెప్పారు. అంతవరకూ ఏ ఒక్క పార్టీ నేత కూడా పొత్తుల మీద మీడియా ముందు మాట తూలొద్దు జారవద్దు అనేశారు ఆయన.
అంతే కాదు తాను విడిగా వస్తానా పొత్తులతో వస్తానా అన్నది కూడా ఇపుడే చెప్పను అన్నారు కరెక్ట్ టైం లో డెసిషన్స్ ఉంటాయని పవన్ అంటున్నారు. అది కూడా పార్టీ నేతలను అందరినీ దగ్గర పెట్టుకుని వారితో చర్చించి కానీ తాను నిర్ణయం తీసుకోను అని భరోసా ఇచ్చారు. పొత్తులు అంటే చిన్న మ్యాటర్ కాదు అని పవన్ అనడం వెనక చాలా అర్ధాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక ప్రజలకు సేవ చేయాలని ఎవరికైనా ఉంటుందని, అధికారం దానికి కావాలని పవన్ కీలక కామెంట్స్ చేశారు. తాను వారాహి యాత్ర గురించే పార్టీ నేతలతో సమావేశాలు పెడుతూ వారి అభిప్రాయాలు తీసుకుంటున్న నేపధ్యంలో పొత్తుల వంటి అతి పెద్ద అంశంలో ఎందుకు అభిప్రాయాలు తీసుకోను అని ఆయన ప్రశ్నించారు. పొత్తుల విషయం అన్నది తరువాత చూసుకుందామని పవన్ చెప్పడం ద్వారా పెండింగులో పెట్టేశారు.
ఏపీలో టీడీపీ స్పీడ్ పెంచుతోంది. అదే సమయంలో తొందరగా పొత్తులు కుదిరితే వైసీపీ మీద పై చేయి సాధించాలని చూస్తోంది. పొత్తులకు జనసేన సుముఖం అని భావిస్తున్న నేపధ్యంలో పవన్ ఇపుడు కాదు తొందరేముంది అంటూ చేస్తున్న కామెంట్స్ చూస్తే నిజంగా టీడీపీకి ఇది షాకింగేనా అన్న చర్చ సాగుతోంది.
అంతే కాదు పవన్ గతంలో చాలా సార్లు అన్ని పార్టీలు కలవాలి. అందరూ కూటమి కట్టాలని అని పిలుపు ఇచ్చారు ఇపుడు ఆయనే పొత్తులకు తొందర ఏముంది అంటున్నారు. దాంతో టీడీపీ ఇరకాటంలో పడుతోంది. వారాహి యాత్ర మొదటి విడత సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో పవన్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది అని అంటున్నారు
అంతే కాదు ఆయన ఆలోచనలు కర్నాటకలోని జేడీఎస్ పార్టీని పోలి ఉన్నాయని అంటున్నారు. అక్కడ పాత మైసూరు ప్రాంతాన్ని తన అడ్డాగా చేసుకుని జేడీఎస్ గత మూడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే సీఎం పోస్టుని తీసుకుంటోంది. అలా కాంగ్రెస్ బీజేపీ కూడా రెండు దఫాలు కుమారస్వామిని సీఎం గా చేశాయి.
ఇపుడు పవన్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని అంటున్నారు. ఉభయగోదావరి జిల్లాలను జనసేన గట్టిగా పట్టుకోవాలని చూస్తోంది. అక్కడ వైసీపీకే కాదు టీడీపీకి కూడా చోటు లేకుండా మొత్తానికి మొత్తం తామే రాజకీయంగా ఆక్యుపై చేసిన పక్షంలోనే ఏపీ రాజకీయం తమకు అనుకూలం అవుతుందని, సీఎం పీఠం కూడా రాయబేరాలతో తమ దగ్గరకు వస్తుందన్న భారీ వ్యూహంతోనే జనసేన ఉంది అని అంటున్నారు. అందుకే పొత్తులకు తొందర ఏముంది అని పవన్ అంటున్నారు.
పవన్ ఈ మాటలు అనడం వెనక మరో వ్యూహం కూడా ఉంది అని అంటున్నారు. తన బలం ఏమిటో వారాహి యాత్ర నిరూపించింది. ఇక సీట్లు ఎన్ని ఇవ్వాలో టీడీపీయే తేల్చుకోవాలన్న సందేశం కూడా ఉందని ఆయన భావన అంటున్నారు. ఏదో జూనియర్ పార్టనర్ కి ఇచ్చినట్లుగా అర కొర సీట్లు ఇస్తే మాత్రం విడిగాఎన పవన్ రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన గోదావరి జిల్లాలనే ఫుల్ గా ఫోకస్ చేసి బలమైన రాజకీయ ఫోర్స్ గా జనసేనను తీర్చిదిద్దాలని చూస్తున్నారు అని అంటున్నారు.