Begin typing your search above and press return to search.
కాపులు కూడా పవన్ను నమ్మటం లేదా ?
By: Tupaki Desk | 15 March 2023 6:00 PM GMTఈ విషయం వినటానికే ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఈ విషయాన్ని చెప్పుకున్నది స్వయంగా పవన్ కల్యాణే కాబట్టి నమ్మాల్సిందే. బందరు బహిరంగసభలో పవన్ మాట్లాడుతు కాపులు కూడా తనను ఎందుకు నమ్మటంలేదని ప్రశ్నించారు. తనను నమ్మమని పదేపదే కాపులను బతిమలాడుకున్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని, కాపులు తనకు అవసరమే లేదని మొహంమీదే చెప్పిన జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు కానీ తనను మాత్రం ఎందుకు నమ్మటంలేదని పవన్ కాపులను నిలదీశారు.
పోయిన ఎన్నికల్లో కాపులు తనకు ఓట్లేసుంటే కచ్చితంగా గెలిచుండేవాడినే అని అన్నారు. కాపులు కూడా తనకు ఓట్లేయని కారణంగానే తాను ఓడిపోయానని నిష్టూరంగా మాట్లాడారు. తాను కులాలకు అతీతమని ఒకవైపు చెప్పుకుంటూనే మరోవైపు స్వయంగా కాపు నేతను అయిన తనను కాపులు నమ్మకపోతే ఎలాగంటు తెగ ఫీలైపోయారు. ఇక్కడే పవన్ బాధేమిటో జనాలకు అర్ధమైనట్లులేదు. పవన్నే కాదు ఎవరినైనా జనాలు ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మకూడదు అనే విషయం అనేక అంశాలపైన ఆధారపడుంటుంది.
కేవలం కాపు అయినంత మాత్రాన కాపులందరు పవన్ను నమ్మేయాలంటే అది జరిగేపనికాదు. ఏ సామాజికవర్గంలోని జనాలైనా పలానా నేతను నమ్ముతున్నారంటే అనేక కారణాలుంటాయి. ముందుగా సదరు నేత వ్యక్తిత్వం, జనాలతో నడుచుకునే తీరు లాంటివి చాలా కీలకపాత్ర పోషిస్తాయి. ఇక్కడే తనలోని లోపాలను పవన్ తెలుసుకోలేకపోతున్నారు. పవన్ రెండు పడవలపై ప్రయాణాన్ని ముందు మానుకోవాలి.
జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబునాయుడును జనాలు నమ్ముతున్నారంటే జనాల విషయంలో వాళ్ళ కమిట్మెంటే కారణం. 24 గంటలూ, 365 రోజులూ వాళ్ళ బతుకంతా జనాలతోనే ఉంటోంది. కానీ పవన్ విషయం ఇలాగ ఉండదు. సినిమాల్లో బాగా బిజీగా ఉంటున్న పవన్ అక్కడ గ్యాప్ దొరికినపుడు మాత్రమే వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. అదేమిటంటే పార్టీ నడపటానికి డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బుల కోసమే సినిమాల్లో చేస్తున్నానని సమర్ధించుకుంటున్నారు. మళ్ళీ రాజకీయాలు చేయాలంటే డబ్బు అవసరమా ? అని తానే అడుగుతున్నారు. కాబట్టి ముందు సినిమాలన్నింటినీ ఆపేసి 24 గంటలూ జనాల్లో ఉంటేనే జనాలు కొంతైనా నమ్ముతారు లేకపోతే...