Begin typing your search above and press return to search.

పవనే రోడ్ మ్యాప్ ఇచ్చేశారు....ఇక దబిడ దిబిడేనా.....?

By:  Tupaki Desk   |   18 Dec 2022 3:04 PM GMT
పవనే రోడ్ మ్యాప్ ఇచ్చేశారు....ఇక దబిడ దిబిడేనా.....?
X
పవన్ కళ్యాణ్ కి నిలకడ లేదు. మాట మీద నిలబడరు. ఆయన ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు అని విమర్శలు చేసే వారు చేస్తూనే ఉంటారు. కానీ ఆయన ఒక్క విషయంలో మాత్రం మాట మీద నిలబడ్డారు. ఆనాడు అంటే అన్న గారు చిరంజీవి ప్రజారాజ్యం టైం లో యువరాజ్యం నేతగా పంచెలూడగొడతాను అంటూ నాటి వైఎస్సార్ సర్కార్ మీద పూరించిన సమర శంఖం ఆయన తనయుడు జగన్ మీద కూడా అలాగే పూరించే విషయంలో మాత్రం ఆయన ఎక్కడా మాట తప్పలేదు. నిలకడ కూడా తప్పలేదు.

తాజాగా సత్తెనపల్లి టూర్ లో పవన్ చెప్పిన మాటలను వింటే కనుక కచ్చితంగా ఆయన రోడ్ మ్యాప్ ఏంటి అన్నది అర్ధమవుతుంది అంటున్నారు. పవన్ కావాలనో లేక వ్యూహాత్మకంగానో 2014 ఎన్నికలను పొత్తులను గుర్తు చేశారు. 2019లో కనుక కచ్చితంగా పొత్తులు పెట్టుకుని ఉంటే ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పడేదే కాదు అని పవన్ సంచలన డైలాగులే చెప్పారు.

అంటే వైసీపీ అధికారంలోకి రావడానికి టీడీపీ జనసేన విడిగా పోటీ చేయడమే అని పవన్ భావిస్తున్నారు అనుకోవాలి. మరి ఇంత క్లారిటీగా పవన్ ఉన్న తరువాత 2024 ఎన్నికలను ఊరకే పోనిస్తారా. ఆయన తన జనసేనను టీడీపీతో పొత్తు లోనే తీసుకెళ్తారని స్పష్టమైంది అంటున్నారు. పవన్ మరో మాట అన్నారు ఇప్పటంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తాను చెప్పిన మాటలను మరచిపోలేదని, అలాగే చేస్తాను అని.

అంటే ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకుండా చూస్తాను అని ఇప్పటంలో పవన్ చెప్పుకొచ్చారు. ఇపుడు సత్తెనపల్లి మీటింగులో కూడా అదే చెప్పారు. అంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులు ఖాయమనే పవన్ మాటలను బట్టి అర్ధమవుతోంది అంటున్నారు. మరి 2014 ఎన్నికల పొత్తు రిపీట్ కావాలీ అంటే బీజేపీ కూడా కలవాలి. పవన్ చూస్తే బీజేపీతో మిత్రుడిగానే ఉన్నారు.

కాబట్టి ఆ పార్టీ కూడా ఎన్నికల వేళకు కలసివస్తుంది అని అంటున్నారు. అంటే మూడు పార్టీలు మళ్ళీ కలుస్తాయి అనే సందేశాన్ని పవన్ వినిపించారు అని అంటున్నారు. మరో మాట కూడా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ తన వ్యూహాలు అన్నీ కూడా ఏపీ గురించే దాని అభివృద్ధి గురించే ఆధారపడి ఉంటాయని అన్నారు. ఏపీకి వైసీపీ హానికరమని, మళ్ళీ ఆ పార్టీ రాకూడదు అని పదే పదే చెబుతున్న పవన్ ఒక వేళ వైసీపీ కనుక మళ్ళీ నెగ్గితే ఏపీని కాపాడలేమని చెబుతున్న పవన్ కచ్చితంగా తన వ్యూహాలను ఏపీ రాష్ట్రం కోసమే తీసుకుంటారనే అంటున్నారు.

అంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులు కచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఉంటాయని పవన్ చెప్పేశారు అనుకోవాలి. అంతే కాదు పవన్ మాచర్లలో టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడులను కూడా ప్రస్తావించారు. మరి ఆయన టీడీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు అన్నడానికి ఇంతకంటే ఏమి కావాలని అంటున్నారు. మొత్తానికి చూస్త పవన్ మార్క్ రోడ్ మ్యాప్ తోనే 2024 ఎన్నికలు జరుగుతాయి అని అంటున్నారు. ఇప్పటంలో బీజేపీని రోడ్ మ్యాప్ అడిగిన పవన్ సత్తెనపల్లికి వచ్చేసరికి తానే రోడ్ మ్యాప్ ప్రకటించారు. దటీజ్ పవన్. సో ఇపుడు కౌంటర్ స్ట్రాటజీ ఏంటి అన్నది వైసీపీ ఆలోచించుకోవాల్సి ఉంది. అంతే