Begin typing your search above and press return to search.

'వారాహి' న‌డిచినా.. వ్యూహాలు న‌డ‌వ‌ట్లేదుగా!

By:  Tupaki Desk   |   11 Dec 2022 4:30 PM GMT
వారాహి న‌డిచినా..  వ్యూహాలు న‌డ‌వ‌ట్లేదుగా!
X
జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేసి.. ఇన్నాళ్ల‌యినా, ఇన్నేళ్ల‌యినా.. ఒక వ్యూహం అంటూ ఉందా.. అంటే.. మూ తి బిగింపులు అల‌క‌లు మాత్ర‌మే క‌నిపిస్తుంటాయి. దీనికి కార‌ణం వ్యూహం లేక‌పోవ‌డం.. ఏ ఎండ‌కు ఆ గొ డుగు అన్న‌ట్టుగా.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో నాలుగు మాట‌లు మాట్లాడ‌డం.. త‌ర్వాత సైలెంట్ అయిపోవ‌డమే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తారో.. ఆ పైవ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తారా? అనేది ప‌క్క‌న పెడితే.. అస‌లు పార్టీని న‌డిపించే వ్యూహం ఏది? అంటే.. వారాహి వ‌స్తోంద‌ని చెబుతున్నారు.

జ‌న‌సేన వంటి అత్యంత కీల‌క‌మైన పొజిష‌న్‌లో ఉన్న పార్టీల‌కు వ్యూహాలు కీల‌కం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాక‌పోతే.. పైవ‌చ్చే ఎన్నిక‌లు ఉన్నాయంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. అయితే, ప‌వ‌న్ ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా.. ఎప్పుడు పార్టీ మారాలా? అని ఎదురు చూస్తున్నవారు.. ప్ర‌త్యామ్నాయం కోరుకుంటున్న వారు.. ఇత‌ర పార్టీల్లో ఉన్న వారు దీంతో గ‌జిబిజికి గుర‌వుతున్నారు.

జిల్లాల స్థాయిలో చూసుకుంటే 26 జిల్లాల్లో ఒక్కొక్క‌ ఇంచార్జ్ ఉండాలి. కానీ, జ‌న‌సేన‌లో ప‌ది మంది కూడా లేరు. నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు ఉండాలి.. అది కూడా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారు ఎక్క‌డున్నారు? అంటే.. అధినేత‌కే తెలియ‌ని ప‌రిస్థితి. ఇక‌, న‌న్ను గెలిపించండి.. అంటే.. అసలు ఈ నినాదాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లి ప్ర‌చారం చేసే సైన్య‌మే లేన‌ప్పుడు..సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌.

రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టుమ‌ని 50 మంది బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారా? అంటే అది కూడా లేదు. కానీ, ఇప్పుడు అంద‌రి దృష్టీ వారాహిపై ప‌డింది. దీనిని ప్ర‌చార ర‌థంగా తీర్చి దిద్దారు. వారాహి వ‌స్తోంది. వైసీపీ భ‌ర‌తం ప‌డుతుంది.. అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. కానీ, వ్యూహం, ల‌క్ష్యం, దిశ ఇవి లేన‌ప్పుడు..ఉద్య‌మ పార్టీగానే నిలిచిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.