Begin typing your search above and press return to search.
రీల్ కు రియల్ కు తేడా ఇదే.. పవన్ కు అనుభవంలోకి తేనున్న కొత్త కేసు
By: Tupaki Desk | 13 Nov 2022 4:26 AM GMTరీల్ లో దర్శకుడు రాసుకున్నట్లుగా సీన్ లు ఒకటి తర్వాత ఒకటన్నట్లుగా ఉంటుంది. హీరోకు ఎదురుదెబ్బలు తగిలినా.. ఒక స్థాయి దాటిన తర్వాత హీరో చెలరేగిపోవటం.. బొమ్మ తిప్పేయటం అన్నది చాలా సింఫుల్ గా.. నిమిషాల తేడాతో జరిగిపోవటంరీల్ లైఫ్ లోచూస్తుంటాం. అందుకు భిన్నంగా ఉంటుంది రియల్ లైఫ్. ఈ తేడా ఎంతన్న విషయం జనసేన అధినేతకు బాగా అర్థమయ్యేలా జగన్ సర్కారు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఇప్పటం గ్రామం వార్తల్లోకి రావటమే కాదు.. ఆ గ్రామంలో తమ పార్టీ పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తున్న వారి ఇళ్లను.. ఆస్తులను దెబ్బేసేలా అధికారులు.. పోలీసులు వ్యవహరించారన్న మాటతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా కారు మీద కూర్చొని ఆయన ప్రయాణించిన వైనం రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండటమే కాదు.. సమకాలీన రాజకీయాల్లో అంతటి దమ్ము చూపించే సత్తా మరే రాజకీయ అధినేతకు లేదన్న కాంప్లిమెంట్లు పవన్ కు వచ్చాయి.
అదే సమయంలో.. ఒక రాజకీయ అధినేతగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్.. కారు మీద ఆ తీరులోకూర్చొని జర్నీ చేయటం ద్వారా.. ఎలాంటి సంకేతాల్ని ఇవ్వాలని భావిస్తున్నారు? అంటూ వేలెత్తి చూపించే కార్యక్రమం మొదలైంది. వేగంగా వెళ్లే కారు మీద కూర్చొని ప్రయాణించిన జనసేనాని తీరును తప్పు పడుతూ తాజాగా పోలీసులు కేసు నమోదు చేయటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏ చిన్నఅవకాశం లభించినా.. పవన్ కల్యాణ్ పై కేసులు పెట్టేందుకుఏపీ పోలీసులు భూతద్దాలు వేసుకొని మరీ వెతుకుతున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. తాజా పరిణామాల్ని ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పటం గ్రామాన్ని సందర్శించింది ఎప్పుడు? కారు మీద ఎక్కిప్రయాణించింది ఎప్పుడు.. కేసు నమోదు చేసేదెప్పుడు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.తమ అధినేతను ఇరుకున పెట్టటానికి.. కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వీలుగా జగన్ సర్కారుప్లానింగ్ చేసినట్లుగా చెబుతున్నారు.
తాజా ఎపిసోడ్ ను చూసిన తర్వాత పవన్ కు రీల్ కు.. రియల్ కు తేడా స్పష్టంగా తెలిసిపోతుందని చెబుతున్నారు. టార్గెట్ చేసి మరీ రాజకీయాలు చేస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని అర్థమయ్యేలా జగన్ సర్కారు ప్రవర్తిస్తోందన్న మాట జనసేన వర్గాల నుంచి వినిపిస్తోంది. పవన్ కారుమీద ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించటాన్ని తప్పు పడుతూ.. తెనాలికి చెందిన వ్యక్తి తాడేపల్లి పోలీసులకు కంప్లైంట్ చేయటంతో పవన్ మీద కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.
కారు టాప్ మీద ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించటం.. ర్యాష్ డ్రైవింగ్ చేయటం.. హైవేపై పలు వాహనాలు పవన్ వాహనాన్ని అనుసరించటం లాంటి కారణాల్ని ఎత్తి చూపుతూ కేసులు నమోదు చేసిన వైనం ఏపీ రాజకీయ వాతావరణాన్ని మరింత హీటెక్కించేలా చేస్తుందంటున్నారు. ఇది కచ్ఛితంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్యగా జనసేన శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. కారు మీద ఎక్కి పవన్ ప్రయాణించింది ఎప్పుడు? కేసు నమోదు చేసేదెప్పుడు? అంటూ ప్రశ్నల్ని సంధిస్తున్నారు. ఈ కేసు నమోదుపై జనసేన వర్గాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయన్నది చూడాలి.