Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం క్లాస్ తీసుకున్న పవన్ మాస్టార్...సీరియస్ గానే...?

By:  Tupaki Desk   |   30 Oct 2022 11:30 PM GMT
ఫస్ట్ టైం క్లాస్ తీసుకున్న పవన్ మాస్టార్...సీరియస్ గానే...?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎపుడూ తన పార్టీ వారిని ఒక్క మాట అనరు. పైగా వారిని ప్రాణంగా చూసుకుంటారు. వారు ఏం చేసినా ఆయనకు నచ్చుతుంది. నిజమే వారు కూడా పవన్ అంటే ప్రాణం పెడతారు. అందుకే ఆయన కూడా వారిని పల్లెత్తు మాట అనర్. పైగా తన కోసం అన్నీ వదులుకుని వచ్చి మరీ ఏటికి ఎదురీది పనిచేస్తున్నారు అన్న సానుభూతి కూడా ఆయనకు ఉంది. అలా జనసేనానికి సైనికులది తండ్రీ బిడ్డల బంధంగా ఉంటూ వచ్చింది.

అయితే ఫస్ట్ టైం మాస్టర్ అవతారం ఎత్తేశారు పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన మూడు గంటలకు పైగా జరిగిన పీఏసీ సమావేశంలో పార్టీ నాయకులకు గట్టిగానే క్లాస్ తెసుకున్నారు. పనిచేయని వారు జనసేనకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే టైం లో పార్టీలో చోటు దక్కాలీ అంటే పనిచేస్తేనే అంటూ కండిషన్ పెట్టారు.

అంటే జనసేనలో కూడా పనిచేయకుండా షోకులు చేస్తూ షాకులు చెప్పేవారు ఉన్నారా అన్నదే ఇపుడు పెద్ద డౌట్ గా ఉంది మరి. నిజానికి జనసేనలో ఉండేవారు అంతా ట్రెడిషనల్ పొలిటీషియన్స్ కంటే భిన్నంగా ఉంటారు. వారంతా పవనిజం అనే ఫిలాసఫీతో రాజకీయాలు చేస్తారు. వారంతా ఒక్కో పవన్ లా ఉంటారు. పవన్ మాదిరిగానే వారు వాదిస్తారు మాట్లాడుతారు. అలా సిద్ధాంతం కోసమే తాము ఉన్నామని చెప్పుకుంటారు.

అలాంటి పార్టీలో అందరికీ ఒక్కటే ఆశ. పవన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నదే వారి తాపత్రయం. మరి అలా అహరహం పనిచేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే అందరూ అలా ఉండరు కదా. కొంతమంది అయినా పని తక్కువ చేసిన వారు ఉండొచ్చు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కానీ వేరే చోట్ల ట్రెడిషనల్ పాలిటిక్స్ కి అలవాటు పడి జనసేనలో చేరిన వారు కానీ చేరడానికి క్యూ కడుతున్న వారు కానీ ఉంటే మాత్రం వారికే పవన్ మాస్టార్ ఇపుడు క్లాస్ తీసుకున్నారు అనుకోవాలి.

పనిచేస్తేనే చోటూ సీటూ అని పవన్ క్లారిటీగా చెప్పేశారూ అంటే ఇక జనసేనలో చేరే వారు కూడా చమట చిందించాల్సిందే. అంతే తప్ప అధినేత ఇమేజ్ తోనో లేక క్యాడర్ కష్టంతోనో గెలిచిపోదామనుకుంటే కుదరదు అని పవన్ అంటున్నారు అన్న మాట.

ఇక వచ్చే నెల నుంచి వైసీపీ ప్రజా వ్యతిరేక ఉద్యమాలకు పవన్ డిజైన్ చేస్తున్నారు. మరి ఆ ఉద్యమాలను నూటికి నూరు శాతం సక్సెస్ చేయాలీ అంటే పనిచేయాల్సిందే. ఎండన పడాల్సిందే. ఇక మీదట పార్టీ పటిష్టతతో పాటు నాయకుల సామర్ధ్యాన్ని కూడా అంచనా వేస్తానని పవన్ పక్కాగా చెప్పాక ఎవరైనా రంగంలోకి దిగాల్సిందే. మొత్తానికి ఇదంతా చూస్తూంటే పవన్ సీరియస్ గానే పార్టీ నిర్మాణంతో పాటు వైసీపీని గద్దే దించి కొత్త రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.