Begin typing your search above and press return to search.
టీడీపీకి వైసీపీకి చావో రేవో... పవన్ కి మాత్రం...?
By: Tupaki Desk | 16 Oct 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలు అధికార వైసీపీకి ప్రతిపక్ష టీడీపీకి చావో రేవో లాంటివి అనే అంటున్నారు. ఏ పార్టీ ఓడినా ఇబ్బందులు అలా ఇలా ఉండవు. సాధారణంగా రాజకీయాలలో ఉన్న వారికి గెలుపోటములు సహజం. కానీ ఇపుడు ఏపీలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే ఏకంగా ఓటమి కాదు ఎలిమినేషన్ రౌండే అన్నట్లుగా తీసుకువచ్చారు.
ఒక పార్టీ గెలిచి అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ నిర్మాణాత్మకమైన సలహా సూచనలు ఇస్తూ ఉండాలి. ఆ మీదట జనం మెచ్చ విపక్షం పార్టీని గద్దెనెక్కించవచ్చు. ఇదీ ప్రజాస్వామ్య సహజ సూత్రం. అయితే చాలా కాలంగా మారుతూ వస్తున్న రాజకీయం బట్టి చూస్తే అధికారంలో ఉన్న పార్టీలు తమకు ఉన్న బలాన్ని చూపించి విపక్షాన్ని లేకుండా చేయాలని గట్టిగా యత్నిస్తున్నాయి.
దాంతో పాటుగా డీ మోరలైజ్ చేసి ఏకంగా పార్టీని అన్నద్ది ఎలిమినేట్ చేయాలని కూడా పధక రచన చేస్తున్నాయి. దీని వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకు చాయిస్ తగ్గిపోతోంది, అలగే ఒకే పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకోవడం మాత్రం ఎపుడూ ప్రజాస్వామ్య హితం కాదు.
ఆనాడు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు చంద్రబాబు విజన్ ట్వెంటీ ట్వెంటీ అంటూ 2020 దాకా అధికారంలో ఉండాలని భావించేవారు. ఇక 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన బాబు 2050 విజన్ అంటూ శాశ్వతంగా టీఎడీపీ పవర్ లో ఉండాలని ఆశించే ప్రకటనలు చేశారని అంటున్నారు.
జగన్ సీఎం కాక ముందే తనకు ఒక్క చాన్స్ ఇస్తే చాలు ముప్పయ్యేళ్ళు అధికారంలో ఉంటాను అని తనకు తానే చెప్పేసుకున్నారు. జనాలు ఎటూ ఒక్క చాన్స్ ఇచ్చారు. దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తన థర్టీ ఇయర్స్ పవర్ కల సాకారం చేసుకోవాలని చూస్తున్నారు. దాంతో 2019లో గెలిచిన దగ్గర నుంచి జగన్ తన మార్క్ పాలిటిక్స్ ని స్టార్ట్ చేశారు.
ఎక్కడికక్కడ టీడీపీని వీక్ చేయడం వంటి వ్యూహాలను అమలు చేశారు. దాంతో పాటు టీడీపీ నాయకుల మీద ఉక్కు పాదమే మోపారని ఆ పార్టీ వారు అంటున్నారు. ఇంతకు ఇంత వడ్డీ రేపు మేము వస్తే చెల్లిస్తామని కూడా చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీకి పవర్ ఏంటో చూపిస్తామని అంటున్నారు.
దాంతో రేపటి ఎన్నికల్లో కనుక వైసీపీ ఓడిపోతే కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయనే అంటున్నారు. వైసీపీ గెలుపునకు దగ్గరగా వచ్చి ఓడినా ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలను 2014లో చేసినట్లుగా టీడీపీ లాగేసుకుని పూర్తిగా నిర్వీర్యం చేసేలా చూస్తుందని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికలు గెలవడం అన్నది వైసీపీకి అత్యవసరంగా మారుతోంది.
ఇక టీడీపీ విషయం అలాంటిదే అనుకోవాలి. టీడీపీ వచ్చే ఎన్నికల్లో వరసగా రెండవసారి ఓడితే మాత్రం ఆ పార్టీని ఈసారి ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా ఎమ్మెల్యేలను మొత్తం లాగేసుకోవడం వంటి చర్యలకు వైసీపీ దిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఈసారి వైసీపీ ఓడితే ఏపీలో తమకు ఎదురు ఉండదని టీడీపీ భావిస్తూంటే టీడీపీని మళ్లీ ఓడిస్తేనే ఏపీలో విపక్షమే లేకుండా చేయవచ్చు అని వైసీపీ ఆలోచిస్తోంది అంటున్నారు.
మొత్తానికి ఈ రెండు పార్టీలకు చావో రేవో అన్నట్లుగా 2024 ఎన్నికలు మారాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో బెటర్ పొజిషన్ లోనే ఉన్నారు అని అంటున్నారు. ఆయన 2024లో చెప్పుకోదగిన ఫలితాలను తెచ్చుకోకపోయినా కూడా తన రాజకీయాన్ని ఆయన హ్యాపీగా చేసుకోవచ్చు అంటున్నారు.
సో ఎలాంటి టెన్షన్ లేని స్థితిలో పవన్ ఉండగా బాబు జగన్ మాత్రం వచ్చే ఎన్నికల మీద వాటి ఫలితాల మీద ఆలోచిస్తూ తమ బుర్రలను వేడెక్కించుకుంటున్నారు. మరి ఫలితం చెప్పాల్సింది ప్రజలే. వారు ఎవరి జాతకాన్ని ఎలా రాస్తారో చూడాలి.