Begin typing your search above and press return to search.
జగన్ చెప్పిన జనసేన బలం.. పవన్ ఏం చేస్తారు..?
By: Tupaki Desk | 31 July 2022 11:30 AM GMTఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. కొన్ని కొన్ని విషయాలు..ప్రత్యర్థుల నోటి నుంచి వస్తే. తప్ప.. రుచిగా ఉండవు. ఇప్పుడు జనసేన విషయంలో అదే జరిగింది. జనసేన అధినేత పవన్‌కు ఇప్పటి వరకు కూడా.. కాపు సామాజిక వర్గం అండగా ఉందనే విషయం తెలుసో తెలియదో కానీ.. ఈ విషయంలో అధికార పార్టీ అధినేత.. సీఎం జగన్‌కు బాగానే తెలిసింది. మరి ఆయన చేయించిన ఇంటిలిజెన్స్ సర్వే కావొచ్చు.. లేదా.. ఆయనకు పార్టీ వర్గాల నుంచి ఉన్న సమాచారం కావొచ్చు.
ఏదేమైనా.. కాపు సామాజిక వర్గం ఇప్పుడు పవన్‌తోనే ఉన్నదనే విషయాన్ని జగన్ పరోక్షంగా బయటకు చెప్పారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గాన్ని గుండుగుత్తుగా చంద్రబాబుకు అమ్మేసేందుకు పవన్ రెడీగా ఉన్నారని.. అన్నారు. ఇది పరోక్షంగా.. పవన్‌ను బద్నాం చేసేందుకు జగన్ చేసిన వ్యాఖ్యే అయినా.. దీనిలో అంతరార్థం గమనిస్తే.. ఇప్పుడు రాష్ట్రంలోని కాపు నాయకులు.. సాధారణ ప్రజలు అంతా కూడా.. పవన్‌ను తమ నేతగా ఓన్ చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది.
ఇది ఎప్పుడో.. గతంలో వంగవీటి రంగా కు దక్కిన అరుదైన గౌరవం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత..ఇప్పటికి.. మళ్లీ అదే గౌరవం.. ఆదరణ పవన్‌కు లభించ బోతున్నట్టుగానే భావించాలి. మరి దీనిని ఆయన స్వాగతిస్తారా? కాపు నాయకుల నాడి తెలుసుకుని .. అడుగులు వేస్తారా? లేదా.? అనేది చూడాలి. ఎందుకంటే.. తనను తాను ఒక కులానికి కట్టేసుకునేందుకు పవన్ ఇష్టపడడం లేదు. దీనివల్ల మిగిలిన కులాల వారు తనకు సహకరించరని అనుకుంటున్నారో.. ఏమో.!
కానీ, ఎవరు కాదన్నా.. ఔనన్నా.. రాష్ట్రం ఎప్పుడో కులాల వారీగా.. చీలిపోయింది. వైసీపీ అంటే..రెడ్డి కమ్యూనిటీ, టీడీపీ అంటే.. కమ్మ కమ్యూనిటీ అనేలా.. పార్టీలు విభజన జరిగిపోయాయి. అయితే.. ఇప్పుడు.. పవన్ కాపు అయితే.. నష్టం ఏముంది. ఇతర పార్టీల్లో మాదిరిగానే ఆయన పార్టీలోనూ.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటారు. సో.. ఇంతకీ చెప్పొచ్చే దేంటంటే.. ఇక ముందు వెనుక ఆలోచించకుండా..కాపు వర్గాన్ని ఆయన ఓన్ చేసుకుంటే.. ఇటు పార్టీకి.. అటు ఆయనకు కూడా.. అన్ని విధాలా వచ్చే ఎన్నికల్లో మేలు జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. సిద్దాంతాలు.. కట్టుబాట్లు ఎప్పుడూ.. అలానే ఉంటాయని..అధికారం వచ్చాక.. వాటిని అమలులో పెట్టుకునే అవకాశం కూడా దక్కుతుందని చెబుతున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.