Begin typing your search above and press return to search.
మిత్రుడి హితబోధ : పవనూ...బాబును పెంచకుమా...?
By: Tupaki Desk | 19 Jun 2022 10:30 AM GMTరాజకీయాల్లో స్వార్ధం ముఖ్యం. అదే పరమార్ధం కూడా. ఎవరితో స్నేహం చేసినా నేను నాది అన్న ప్రధాన సూత్రమే రాజకీయ కధను సాఫీగా నడిపిస్తుంది. అయితే జనసేనానిలో ఇది కొంత తక్కువే అని చెప్పాలి. ఆయన కనుక నేను అని అనుకుంటే 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఎంతో కొంత ఉనికి చాటుకునే వారు. కాని కాలం రాంగ్ టైమ్ లో 2019 ఎన్నికల వేళ సొంతంగా బరిలోకి దిగి పరువు తీసుకున్నారు. రెండు చోట్లా ఓడారు.
సరే మళ్ళీ రెండేళ్ళలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి పవన్ ఏమైనా గత కాలపు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారా అంటే లేదు అని జనసైనికుల మాటలను బట్టి తెలుస్తోంది. ఆయన మనసులో ఉన్నది అంతా ఓపెన్. ఆయనకు అర్జంటుగా జగన్ గద్దె దిగాలి అంతే. ఆ సీట్లో తాను కూర్చోవాలని లేదు అని ఆయన పాలిటిక్స్ ని దగ్గర ఉండి చూసిన వారు చెబుతారు.
ఇక మంగళగిరిలో ఆ మధ్య పార్టీ నేతలతో మాట్లాడుతూ పవన్ మూడు ఆప్షన్లు టీడీపీకి ఇచ్చినా కూడా ఎన్నికల వేళకు ఆయన మెత్తబడుతారని, బాగా తగ్గుతాడని టీడీపీ వారికి కూడా ఆశలు ఉన్నాయట. సరే ఆ విషయం పక్కన పెడితే రాజకీయాలలో సీనియర్, దేశాన్ని ఏలుతున్న పెద్దన్న జనసేనకు మిత్రపక్షం అయిన బీజేపీ అయితే చాలానే పాఠాలు పవన్ కి ఈ విషయంలో చెబుతోందిట.
పవనూ చంద్రబాబుని పెంచమాకు అని హితబోధ చేస్తోందిట. జగన్ గద్దె దిగితే ఏంటి, ఉంటేనేంటి పవర్ మన చేతులలోకి రానపుడు అని కూడా సీనియర్ కమలనాధులు సూచిస్తున్నారుట. ఏపీలో రాజకీయ శూన్యత సృష్టిస్తే దాని నుంచి బీజేపీ జనసేన ఎదిగే అవకాశాలు ఉంటాయని నూరి పోస్తున్నారుట. ఏపీలో తెలుగుదేశం పార్టీ వీక్ అయితేనే తమ పార్టీలకు చాన్స్ వస్తుందని కూడా నచ్చచెబుతున్నారుట.
ఇక తెలుగుదేశం ఓటు బ్యాంక్ మొత్తానికి మొత్తం తమ రెండు పార్టీలకు టర్న్ కావాలంటే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవాలని కూడా జనసేనకు సూచిస్తున్నారుట. ఈసారి కనుక టీడీపీని గెలిపిస్తే మళ్లీ తమ పార్టీలకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని గెలిచే అవకాశాలు కానీ ఆల్టర్నేషన్ గా నిలిచే అవకాశాలు కానీ సన్నగిల్లుతాయని కూడా చెబుతున్నారుట.
సో 2024లో వైసీపీ గెలిచినా ఫరవాలేదు 2029లో మాత్రం కచ్చితంగా బీజేపీ జనసేనకు బంగారు పళ్ళెంలో అధికారం దక్కుతుందని అప్పటికి చంద్రబాబు వయసు పరంగా పూర్తిగా వీక్ అవుతారని, ఆయన పార్టీ కూడా క్షీణీస్తే తమకే ఉపకరంగా ఉంటుందని విశ్లేషించి మరీ విడమరచి చెబుతున్నారుట.
అందువల్ల పవన్ని బీజేపీ గట్టు మీదనే ఉండమని కోరుతున్నాయట. అయితే పవన్ ఆలోచన మాత్రం వేరేగా ఉందని అంటున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించడమే ఆయన ఫస్ట్ ప్రయారిటీ అని చెబుతున్నారు. అలాగే జగన్ సీఎం గా ఉండకూడదు అని కూడా కంకణం కట్టుకున్నారు అని చెబుతున్నారు. ఇక ఏపీలో మరో అయిదేళ్ళ పాటు వైసీపీ అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోతుందని, అది ఢిల్లీ పార్టీలకు అర్ధం కాని విషయమని కూడా ఆయన భావిస్తున్నారు అని చెబుతున్నారు.
అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు అంతా చీల్చకుండా పవన్ చివరి వరకూ తన ప్రయత్నం తాను చేస్తారు అని చెబుతున్నారు. దాంతో ఏపీ రాజకీయాల్లో పొత్తుల ఎత్తులు మరింత ఆసక్తిగా మారాయి. ఢిల్లీ పెద్దలు జనసేన నాయకులతో చెబుతున్నట్లుగా ప్రచారంలో ఉన్న విషయాలు నిజమైతే మాత్రం కచ్చితంగా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు. అదే సమయంలో పవన్ వైసీపీ సర్కార్ రెండవసారి అధికారంలోకి రావడానికి అసలు సహకరించరు. మరి ఈ నేపధ్యంలో టీడీపీ బీజేపీ, జనసేనల ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయి. ఏపీలో ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాల్సిందే.