Begin typing your search above and press return to search.

సేనాని రెడీ : దసరా నుంచి పవన్ బస్సు యాత్ర

By:  Tupaki Desk   |   11 Jun 2022 12:30 AM GMT
సేనాని రెడీ : దసరా నుంచి పవన్ బస్సు యాత్ర
X
ఏపీలో పవన్ బస్సు యాత్రకు రెడీ అయిపోయారు. ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. సడెన్ గా పవన్ బస్సు యాత్రను ప్రకటించేశారు. నిజానికి వచ్చే ఏడాది తరువాత పవన్ రంగంలోకి దిగుతారు, పూర్తి స్థాయిలో టైమ్ కేటాయిస్తారు అని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం చాలా తెలివిగా ఒడుపుగా లాస్ట్ పంచ్ తనదే అని ప్రత్యర్ధులకు సవాల్ విసిరారు.

ఏపీలో రాజకీయం ఒక వైపు హీటెక్కిపోతున్న సంగతి విధితమే చంద్రబాబు నెలకు రెండు జిల్లాలు వంతున ఎడాది పాటు జనంలో ఉండేలా కార్యక్రమాన్ని డిజైన్ చేసుకున్నారు. ఆయన ఈ నెల 15 నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక టీడీపీ తరఫున బాబు బస్సు యాత్ర కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. అలాగే లోకేష్ పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ ఉంటుందని కూడా వార్తలు వినవచ్చాయి.

ఇక ఎలాంటి సౌండ్ లేకుండా జనసేనాని తన బస్సు యాత్రను ప్రకటించడమే ఇపుడు ఏపీ పొలిటికల్ చిత్రంలో బిగ్ ట్విస్ట్. ఇదిలా ఉంటే పవన్ బస్సు యాత్రను ఈ ఏడాది అక్టోబర్ 5న విజయదశ‌మి రోజు నుంచి ప్రారంభిస్తారు అని ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

ఈ యాత్రను తిరుపతి నుంచి పవన్ ప్రారంభించనున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా పవన్ టూర్ సాగుతుంది అని చెప్పడం విశేషం. ఇక వచ్చే ఏడాది మార్చి లో ఎన్నికలు ఏపీలో జరగనున్నాయని ఇందుకు కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు నాదెండ్ల మనోహర్ పిలుపు ఇవ్వడం విశేషం.

అంటే ఎన్నికలు వచ్చే ఏడాది అంటే జగన్ ముందస్తు కోసం రెడీ అవుతున్నారా, ఆ విషయం విపక్షాలకు ముందే చేరిందా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి ఏ ఢిల్లీ వర్గాల నుంచి జనసేనానికి ఉప్పు అందిందో తెలియదు కానీ పవన్ ఛలో బస్సు యాత్ర అని సిద్ధమైపోతున్నారు. ఇక ఏపీలో అంతా వేడే వేడిగా పొలిటికల్ సీన్ ఉంటుంది.