Begin typing your search above and press return to search.

జ‌నసేన కాన్ఫిడెన్స్ కు తిరుగులేదురా !

By:  Tupaki Desk   |   12 May 2022 12:30 AM GMT
జ‌నసేన కాన్ఫిడెన్స్ కు తిరుగులేదురా !
X
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే 70 సీట్లు వ‌స్తాయి అని అంటోంది జ‌న‌సేన. ఆ విధంగా జ‌న‌సేన కాన్ఫిడెన్స్-కు తిరుగేలేదు. తాము ఎవ‌రి ప‌ల్ల‌కీలు మోయం. ఎవ‌రి జెండాలూ మోయం అని కూడా అంటోంది జ‌న‌సేన. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి తాము అనుబంధంగా ఉండ‌బోం అని కూడా తేల్చి చెబుతోంది. అంటే తాము బ‌లంగా ఉన్న శ‌క్తి అని చాటేందుకు జ‌న‌సేన ప్ర‌య‌త్నిస్తోంది.

అదే అభిప్రాయాన్ని సుస్థిరం చేసేందుకు ఇష్ట‌ప‌డుతోంది కూడా! అంటే రానున్న ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై టీడీపీ క‌న్నా జ‌న‌సేన ఫుల్ క్లారిటీతో ఉంది. గ‌తం క‌న్నా మేల‌యిన తీరులో తామున్నామ‌ని కూడా చెబుతోంది. 2014 లో చేసిన త‌ప్పిదాల‌కు మూల్యం చెల్లించుకున్నామ‌న్న అంత‌ర్మథ‌నం కూడా ఒక‌టి వారిలో ఉంది. ఏ విధంగా చూసినా జ‌న‌సేన ఇప్ప‌డు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. ఇదే కాన్ఫిడెన్స్ తో ఎన్నిక‌ల‌కు వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచ‌న‌కు వ‌చ్చింది.

ముఖ్యంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు వినిపించ‌డంలో ముందుండి పోరాడుతోంది. కౌలు రైతుల‌కు ఆర్థిక ఆస‌రా అందిస్తూ వారి క‌ష్టాల‌ను తెలుసుకుంటోంది. ఇందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సొంత నిధుల‌ను 30 కోట్ల మేర కేటాయించారు. త‌న గొప్ప‌నైన మ‌న‌సు చాటారు. దేశంలో ఏ నాయ‌కుడూ చేయ‌ని విధంగా ప‌వ‌న్ ఈ సాయం అందించి మాన‌వ‌త్వం చాటుకున్నారు. అంతేకాదు చాలా ప్ర‌కృతి విల‌యాల్లో అచేత‌నంగా ఉండిపోయిన బాధితుల‌కు అండ‌గా నిలిచారు.

తిత్లీ స‌మ‌యంలో ఆయ‌న త‌న వంతు సాయం ఉద్దానానికి చేశారు. అదేవిధంగా ఉద్దానం మూత్ర పిండ వ్యాధిగ్ర‌స్తుల‌కు స‌కాలంలో వైద్యం అందించి, అక్క‌డ ప్ర‌జ‌ల‌ను ప్రాణ గండం నుంచి గ‌ట్టెక్కించాల‌ని కోరుతూ పోరాటాలు చేశారు. ఇప్ప‌టికిప్పుడు ఫ‌లితాలు కావాల్సింది.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిల‌బ‌డి వారి త‌ర‌ఫున గొంతుక వినిపించ‌డం ముఖ్యం అని చెప్పారు.

అదే మాట రేపు కూడా చెప్ప‌నున్నారు. ప‌ద‌వుల క‌న్నా ప్ర‌జా శ్రేయ‌స్సే ముఖ్యం అని ప‌వ‌న్ భావిస్తూ ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కార్య‌క‌ర్త‌లు కూడా టీడీపీతో పొత్తుకు అంగీక‌రించ‌డం లేదు. ప‌వ‌న్ మాత్రమే సీఎం అభ్య‌ర్థి అయితేనే తాము అందుకు అంగీక‌రిస్తామ‌ని అంటున్నారు.