Begin typing your search above and press return to search.
పవన్ చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారు ?
By: Tupaki Desk | 24 April 2022 7:31 AM GMTసభలకు జనాలు రావటం, అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నా కూడా జనసేనకు ఓట్లు ఎందుకు పడటం లేదు అన్నది పవన్ కల్యాణ్ కు పెద్ద పజిల్లాగ మారిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన సభలకు పెద్దఎత్తున వస్తున్న అభిమానులు ఓట్లు మాత్రం వైసీపీకే వేస్తున్నారంటు మండిపడ్డారు. ఇలాంటి మాటలు పవన్ గతంలోనే చాలాసార్లు అన్నారు.
అంటే తన అభిమానులు కూడా జనసేనకు ఓట్లేయటం లేదనే భావన బలంగా ఉండిపోయింది. ఇదే విషయమై పవన్ ఒకసారి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే పవన్ రాజకీయాలు చేస్తున్న వేదిక ఏమిటి ? ఎవరితో మిత్రపక్షంగా ఉన్నారనే విషయాన్ని ఒకసారి విశ్లేషించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా తుంగలో తొక్కుతున్నది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.
విభజన హామీలను తుంగలో తొక్కడం మొదలు తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేవరకు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నరేంద్రమోడి సర్కార్ వ్యవహరిస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను తొక్కేసి మరోవైపు జనాల ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పవన్ మిత్రపక్షంగా ఎలా ఉంటారు ? ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది పూర్తిగా పవన్ ఇష్టమే. అయితే తనకు ఎందుకు ఓట్లేయటం లేదనే విషయాన్ని జనాలను అడిగే ముందు తను చేస్తున్న తప్పులను విశ్లేషించుకోవాలి.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నపుడు జనాలు జనసేనను కూడా వ్యతిరేకిస్తారన్న చిన్న లాజిక్ ను పవన్ ఎందుకు మిస్సవుతున్నారు ? జనాల్లో నమ్మకం సంపాదించుకోవాల్సిన బాధ్యత పవన్ పైనే ఉంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నంత కాలం జనాలు బహుశా పవన్ను కూడా నమ్మరేమో.
ఒకవైపు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్న బీజేపీని పల్లెత్తు మాట అనటం లేదు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పుకుంటున్న పవన్ కేంద్రాన్ని ఏ విషయంలో నిలదీశారు ? ఏ విషయంలో ప్రశ్నించారు ? అని జనాలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి జనాలైనా అభిమానులైనా జనసేనకు ఎందుకు ఓట్లేయటం లేదో ఒకసారి నిజాయితీగా ఆలోచించుకుంటే బావుటుంది.