Begin typing your search above and press return to search.
జగన్ కి అక్షరాలు నేర్పిస్తా...పవన్ మాస్టార్
By: Tupaki Desk | 28 Jun 2023 9:11 PM GMTమాస్టార్ అవతారం ఎత్తి సీఎం జగన్ కి అక్షరాలు నేర్పిస్తాను అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ లో జగన్ వర్సెస్ పవన్ పాలిటిక్స్ పీక్స్ కి చేరుకుంది. అమ్మ ఒడి పధకం లో భాగంగా జరిగిన సభ లో జగన్ మాట్లాడుతూ పవన్ మీద గట్టిగానే వేసుకున్నారు.
నాలుగు పెళ్ళిళ్ళు అన్నారు. వూగిపోతూ మాట్లాడుతారని అన్నారు. నిలకడ లేదు అన్నారు, వారాహి ని కాస్తా వరాహి గా మార్చేశారు. దాన్ని లారీ అనేశారు. మరి పవన్ కి చిర్రెత్తుకుని రాదా అందుకే ఆయన భీమవరం కార్యకర్తల సభ లో మాట్లాడుతూ సీఎం జగన్ కి అక్షరాలు నేర్పిస్తాను అని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
సీఎం జగన్ కి దీర్ఘాలు వత్తులు పలకలడం రాదు, భవిష్యత్తులో అవన్నీ ఆయన కు నేర్పిస్తా అంటున్నారు. అంటే మాస్టార్ అవతారం ఎత్తుతా ను అని పవన్ అంటున్నారు అన్న మాట. ఇంకా పవన్ ఏమన్నారు అంటే అమ్మ వొడి పధకం అంటే చిన్నారులది అక్కడ అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని. అంటే పవన్ నాలులు పెళ్ళిళ్ళు, పెళ్లాలు గురించి అక్కడ మాట్లాడటం మీదనే పవన్ అన్నారని భావించాలి.
అయితే పవన్ ఈ రోజు మెత్తగానే ఒక స్థాయిలో కౌంటర్ ఇచ్చినా ఇంకా చాలానే ఆయన లో ఉంది అని తెలుస్తోంది. అదే టైం లో ఇక మీదట తాను ఊగిపోతూ మాట్లాడను సీఎం జగన్ స్టైల్ లోనే మాట్లాడుతా ను అని కూడా చెప్పడం విశేషం.
మరి జగన్ స్టైల్ ఏంటో పవన్ ఇమిటేట్ చేఅస్తారా అన్నదే చర్చకు వస్తోంది ఏది ఏమైనా పవన్ వర్సెస్ జగన్ వార్ అలాగే గట్టిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జగన్ లోని లోపాల ను పవన్ ఎత్తిచూపడం మీద వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సి ఉంది.